ఆంధ్రప్రదేశ్‌

అనంతలో మరో ఇద్దరికి ఆంత్రాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, అక్టోబర్ 18: అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం గోరంట్లకు చెందిన ఇద్దరికి వ్యాధి సోకింది. మంగళవారం గోరంట్ల మండలంలోని చెట్లమొరంపల్లికి చెందిన ముగ్గురికి వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. వీరు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గోరంట్లకు చెందిన షహరి, మహబూబ్‌బాషా శరీరంపై బొబ్బలు వచ్చాయి. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆంత్రాక్స్ ప్రబలుతున్న నేపధ్యంలో మండలంలో గొర్రెలు, మేకల మాంసం విక్రయాలు నిషేధించారు. పశువులు, మేకలు, గొర్రెలకు టీకాలు వేస్తున్నారు.