ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసేవే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమమే ధ్యేయం..అభివృద్ధే లక్ష్యం అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు ఆంధ్రను నెంబర్ 1 చేయడమే ఆశయం
కేంద్రం సహకరించాల్సిందే కార్యకర్తల త్యాగాలను మరువలేను టిడిపి 35వ మహానాడులో చంద్రబాబు

తిరుపతి, మే 27: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రతిపక్షంగా ఉన్నచోట ప్రజాసమస్యలపై పోరాటమే సంకల్పంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలకు టిడిపి జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన 35వ మహానాడు వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కర్తవ్యబోధ చేశారు. జాతీయ హోదా లభించిన తర్వాత శుక్రవారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో తొలిమహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. అంతకుమునుపు ఎన్ టి ఆర్ పార్టీ ఆవిర్భావ సమయంలో రాష్ట్ర పర్యటన సందర్భంగా తీసిన ఛాయా చిత్రాలు, ఆయన నటించిన అనేక పౌరాణిక, సాంఘిక చిత్రాలు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యమాలికలతోకూడుకున్న ఛాయాచిత్ర ప్రదర్శనను,ఎన్‌టిఆర్ వైద్య విభాగం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మహానాడు వేదిక ముందు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్‌టిఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు రాహుకాలం ఉండటంతో 12గంటలకు చంద్రబాబు ప్రారంభించి గంటా 20నిముషాల పాటు మాట్లాడారు. బాబు ప్రసంగం అనుకున్న స్థాయిలో నేతలు, కార్యకర్తల్ని ఉత్తేజితం చేయలేకపోయినా అధికారంలో కొనసాగడానికి చేయాల్సిన ప్రజాసేవపై మాత్రం స్పష్టమైన దిశానిర్దేశన చేయగలిగారు. ప్రజా సేవను విస్మరిస్తే రాజకీయాల్లో అధికారం ఎలా దూరమవుతుందో, సేవలు అందించిన వారు ఎలా అధికారంలో కొనసాగుతారో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలను ఉదహరించారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేసినపుడు కార్యకర్తలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాలని, నిరంతరం ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి గండికొట్టి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ ఎలా అధికారంలోకి తీసుకురాగలిగారని తెలిపారు. ఎన్‌టిఆర్ చేసిన ప్రజాసేవ టిడిపికి ఎలా శ్రీరామ రక్షగా నిలుస్తూ ఉందో కూడా వివరించారు. ఆయన స్ఫూర్తితోనే తాను ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న తీరును తెలియజేశారు. రాష్ట్రాన్ని అర్థరహితంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజించడం వల్ల తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ సంక్షేమ పథంలో ఎలా ముందుకు వెళుతున్నదీ చంద్రబాబు వివరించారు. అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు మోకాలడ్డి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. తనది దృఢ సంకల్పమని, వెనుతిరిగే ప్రసక్తేలేదని రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేసేంత వరకు విశ్రమించనని అన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించడంలేదని రాష్ట్రంలోని పేద,బడుగు, బలహీన వర్గాలకు ఒక పెద్ద కొడుకుగా వ్యవహరిస్తానని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తూచ తప్పక అమలు చేస్తామన్నారు.విద్యా వైద్య రంగాలకు పెద్ద పీట వేసి పేదల అక్షరాస్యతకు, ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నానన్నారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి,సంపూర్ణ అక్షరాస్యత ఏ ప్రాంతంలో ఉంటుందో ఆప్రాంతం పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ కోణంలోనే తాను పాలన సాగిస్తున్నాని అన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతుల నడ్డి విరిచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ఒక్కో రైతుకి ఒకటిన్నర లక్ష రుణమాఫీ చేశామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి చేపట్టాల్సిన అంశాలపై ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించానన్నారు. ఇందుకోసం రూ.5వేల కోట్లు వెచ్చిస్తున్నామని, హార్టికల్చర్‌కు రూ.350 కోట్లు వెచ్చించామన్నారు. రెండో విడతగా రూ.4వేల కోట్లు నిధులు ఇస్తున్నామన్నారు. కరవు రహిత ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ఓ మిషన్‌గా అమలు చేస్తున్నామనిన తెలిపారు. ఇందులో భాగంగానే గోదావరి-కృష్ణ అనుసంధానంతో జూన్ నాటికి 20 పంపులతో 80 నుంచి 100 టి ఎం సిల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కరవు ప్రాంతమైన రాయలసీమకు నీటిని తీసుకురావడానికి ఒక భగీరథ కృషి చేస్తున్నామన్నారు. వర్షపాతం తక్కువగావున్న అనంతపురాన్ని సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు.
డ్వాక్రా మహిళలకు రూ.10వేల రుణమాఫితో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఒక్కోమహిళకు రూ.10వేలు ఇచ్చామన్నారు. ఈ ఏడాదిలో నిరుపేద మహిళలందరికీ వంటగ్యాస్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా చేస్తామని సిఎం అన్నారు. ఇప్పటికే 350 ఒప్పందాలతో 4లక్షల 50వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. విభజన సమయానికి రాష్ట్రంలో 22.5 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొరత ఉన్నా దానిని నెల వ్యవధిలోనే అధిగమించామన్నారు. వెనుకబడిన తరగతులకు అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని, వీరి కోసం 8600 కోట్లతో సబ్‌ప్లాన్‌ను చేపట్టామన్నారు. దళిత గిరిజన, మైనారిటీ, కాపులు, బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. రిజర్వేషన్ కేటాయింపులో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే కాకుండా అగ్రవర్ణాల్లో వెనుకబడిన పేదవారికి కూడా రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామన్నారు. మట్టిని అమ్ముకుంటున్న ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా అందించిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. ఇక రాష్ట్రం విభజనతో ఎన్నో సమస్యల్లో ఉన్నామని, వాటిని అధిగమించడానికి కేంద్రం సహకారాన్ని కోరుతున్నామన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం సహకరించలేదని, ఆ పార్టీతో పొత్తు తెంపుకోవాలని కొంత మంది కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలే కాకుండా అన్ని రాష్ట్రాలతో సరిసమానంగా రాష్ట్రం అభివృద్ధి సాధించేవరకు తమకు సహకరించాలని కేంద్రాన్ని నిరంతరం కోరుతున్నామన్నారు. ఇక పార్టీకి మూల స్తంభాలైన కార్యకర్తల సంక్షేమాన్నీ విస్మరించలేదన్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారం అందించే ఘనత టిపిదీదేనన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. ఎంతో మంది గొప్ప కార్యకర్తలను, నాయకులను ప్రతిపక్షాలు పొట్టన పెట్టుకున్నాయన్నారు. అయితే ఇక వారి ఆటలు సాగనీయమన్నారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక నేరప్రవృత్తికలిగిన కుటుంబం అన్నారు. కడప జిల్లాలో నేరప్రవృత్తిలేదని, అది వై ఎస్ కుటుంబంలో మాత్రమే ఉందన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అడ్డుగోలు వ్యవహారాలకు పాల్పడాలని చూస్తే వారి ఆటలు సాగనివ్వనన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిటాల రవి హత్య ఉదంతాన్ని ప్రస్తావించారు. తన ప్రాణాలు ఒడ్డైనా తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలను, రాష్ట్రాన్ని రక్షించుకుంటానన్నారు.