ఆంధ్రప్రదేశ్‌

రెండేసి పెన్షన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 20: సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతున్న ముఖ్యమంత్రి తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఒకరికి రెండు పెన్షన్లు ఇచ్చే ఈ పథకాన్ని జనవరి నుంచి అమలుచేసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులైన వితంతువులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని ఈ పెన్షన్ విధానానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల మొత్తాని గణనీయంగా పెంచిన చంద్రబాబు తాజాగా ఈ కొత్త పింఛను విధానాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక వ్యక్తికి ఒకే పింఛను విధానాన్ని పక్కన పెట్టి వితంతు, వికలాంగుల్లో వయసు పైబడిన వారికి రెండు పింఛన్లు ఇవ్వడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వితంతు, వికలాంగులకు రెండేసి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి తోడు మహిళల వృద్ధాప్య పింఛను వయసు పరిమితిని 60 నుంచి 58 ఏళ్లకు కుదించే అంశంపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ కసరత్తును వీలైనంత త్వరితగతిన పూర్తిచేసి జనవరి నుంచి కొత్త విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిరుద్యోగ భృతిని పొందడానికి అర్హతపై నియమ నిబంధనలు ఖరారు చేశారని, సిఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. నిరుద్యోగ భృతిని నేరుగా నిరుద్యోగులకు ఇవ్వకుండా వారికి వృత్తి, విద్య వంటి పలురకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం గత మూడేళ్లుగా అదే పద్దతి అమలుచేస్తోంది. అయితే ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంలేదని, అదే సమయంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని గ్రహించిన ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నేరుగా అర్హులైన నిరుద్యోగులకు అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పథకాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమంలో ఈ రెండు పథకాలపై ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు అందినట్లు సమాచారం. రేషన్ కార్డులు, పక్కా గృహాలపై కూడా ప్రజల నుంచి వినతులు వచ్చాయని తెలుస్తోంది. ఈ బహుళ పింఛను విధానం, నిరుద్యోగ భృతితో ప్రజల్లో ఉన్న అసంతృప్తి తగ్గి ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వంపై ఉన్న 58 శాతం సానుభూమి ఏకంగా 70 శాతానికి పెరుగుతుందని టిడిపి నేతలు ఆశాభావంతో ఉన్నారు.