ఆంధ్రప్రదేశ్‌

గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 20: ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట గ్రామ శివారులో ఉన్న గొంగటికొండలో ఉన్న పులిగుహలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరుపుతున్న సుమారు 64మంది ముఠాను శుక్రవారం పొదిలి పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఎస్ పి ఏసుబాబు మాట్లాడుతూ దొనకొండ మండలం కొచ్చెర్లకోట గ్రామశివారులో ఉన్న గొంగటికొండలో ఉన్న పులిగుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం అందడంతో కీలకమైన వ్యక్తి రవీంద్రారెడ్డి, నకిలీ బాబాలను అదుపులోకి తీసుకుని ఆయనిచ్చిన సమాచారం ప్రకారం మిగతా 63మందిని అరెస్టుచేశామన్నారు. వీరికి సహకరించిన వ్యక్తులను, తవ్వకాలకు ఆర్థిక సాయం చేసిన వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఈకేసులో సుమారు 74 మంది వరకు నిందితులు ఉండగా ఇందులో సుమారు 64మంది నిందితులను అరెస్టుచేశామన్నారు. వీరిలో కర్నూలు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారన్నారు. అరెస్టుఅయిన నిందితుల్లో కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రధాననిందితుడైన సూరసాని రవీంద్రారెడ్డితోపాటు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న రవీంద్రారెడ్డి సోదరుడు సూరసాని లక్ష్మినరసారెడ్డిలతోపాటు విజయవాడలోని అజిత్‌సింగ్‌కు చెందిన ఉమామహేశ్వరరావు అనే గురూజి, మంగళగిరికి చెందిన అల్లు రత్నశ్రీనివాస్‌రెడ్డి, దొడ్డల దరేంద్రరాయుడులను పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు రుద్రసముద్రం జంక్షన్‌వద్ద శుక్రవారం తెల్లవారుజామున నాలుగుగంటలకు అరెస్టు చేశారన్నారు. వారిని అరెస్టుచేసి వారి వద్ద నుండి రెండు జనరేటర్లు, కంప్రెషర్ ట్రాక్టర్, ఒక అమ్మవారి పెద్దవిగ్రహం, ఒక చిన్న విగ్రహం, గణేష్ విగ్రహం, కమండలం, నంది విగ్రహం, రెండు స్పటిక లింగాలు, ఒక నాగపడగ, గిల్ట్‌నగలు, 75 జిల్‌టిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, పదికేజిల అమ్మోనియోం నైట్రేట్, హీరోహోండా మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారికి పేలుడుసామాగ్రిని సరఫరాచేసిన బండారు వెంకటాద్రిని ఇతర ముఠాసభ్యులైన షేక్ హానీఫ్ బాషా, రుద్రపాటి అనిల్‌కుమార్, బొచ్చు శ్రీనులను మార్కాపురంలోను, తవ్వకాల్లో రవీంద్రారెడ్డికి పెట్టుబడి పెట్టిన హైదరాబాదుకు చెందిన పైనాన్స్‌షియర్లు మారుబోయిన మాల్యాద్రి, తబ్బకుట్టి మల్లికార్జున, డేరంగుల శ్రీనులను ఒంగోలులో అరెస్టుచేశామన్నారు. గుప్తనిధుల ముఠాలో కీలక నిందితుడైన రవీంద్రారెడ్డి నేపధ్యం గురించి ఎస్‌పి వివరిస్తూ కనిగిరికి చెందిన రవీంద్రారెడ్డి ఉత్తరాంచలో అగ్రికల్చర్ ఎంబిఏ చేసి స్టార్ అగ్రోకంపెనీలో ఇండియా మేనేజరుగా పనిచేస్తూ సంవత్సరానికి సుమారు 30 లక్షలరూపాయలు జీతం సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాన్ని వదలి కమోడీస్ ట్రేడింగ్, రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో దిగి కోటిరూపాయల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. దీంతో తొందరగా నగదు సంపాదించాలన్న అత్యాశతో 2014 నుండి విజయవాడలో ఉంటున్న దొంగ గురూజి ఉమామహేశ్వరరావు మాయలోపడి గుప్త నిధులకోసం రకరకాల పూజలు చేయించి ఆయనకు సుమారు 47 లక్ష లరూపాయలు పొగట్టుకున్నట్లు తెలిపారు. కొద్దికాలంలోనే దొంగగురూజి ఉమామహేశ్వరరావుమాయలు తెలుసుకుని అతన్ని వదిలి మరలా అత్యాశ చావక మరో దొంగ గురూజి రాయుడిని రవీంద్రారెడ్డి ఆశ్రయించినట్లు ఎస్‌పి తెలిపారు. దొంగగురూజి రాయుడు తనకుపూజలో గొంగటికొండలోని పులిగుహలో రాజులకాలంనాటి విలువైన వజ్రాలు, విగ్రహాలు మూడుపెట్టెల్లో కనిపించినట్లు చెప్పటంతో నమ్మి వివిధ ప్రాంతాలనుండి సుమారు 50 మందికూలీలను రప్పించి కొండను పేల్చేందుకు మందుగుండు సామగ్రిని డ్రిల్లింగ్ మిషన్‌నుతెప్పించి పెద్దఎత్తున తవ్వకాలు జరిపించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన మాల్యాద్రి, మల్లికార్జున, డేరంగుల శ్రీను, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీను, గోపాల్ వీరు మొత్తం 23 లక్షల రూపాయలు ఈతవ్వకాలకు పెట్టుబడిగా రవీంద్రారెడ్డికి ఇచ్చినట్టు ఎస్‌పి వివరించారు. నిధి దొరికితే అందరు పంచుకునే విధంగా వారు ఒప్పందం చేసుకున్నారన్నారు. వీరికి వెంకటాద్రి,శివశంకర్‌రెడ్డిఅనే వ్యక్తులు పేలుడుకు కావాల్సిన డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రైట్‌తోపాటు ఇతర సామగ్రిని సరఫరాచేసినట్లు తెలిపారు. ఇదిలావుండగా గుప్తనిధుల కోసం శ్రీశైలం దగ్గర ఉన్న అక్కమహా దేవి దేవాలయంలో నరసింహ, హనీఫ్, అనిల్, టైలర్‌శివ, బాలకృష్ణద్వారా ఖలీల్ అనే దొంగ గురూజి ఆధ్వర్యంలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరిపినట్లు తెలిపారు.