ఆంధ్రప్రదేశ్‌

దుబాయ్‌లో మంత్రులు నారాయణ, కొల్లు నిర్మాణాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: ఆరు రోజుల పర్యటనకోసం పురపాలక మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం రాత్రి బయలుదేరి దుబాయ్ చేరుకున్నారు. శనివారం ఉదయం అక్కడ మరో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి దుబాయ్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. అక్కడి అధికారులతో నిర్మాణాల సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎడారి దేశమైన దుబాయ్‌లో అత్యద్భుత సాంకేతికతతో నిర్మాణాలు చేశారని, అక్కడి వాతావరణం, అక్కడి సాయిల్ కండిషన్లకు తగ్గట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించారని ప్రశంసించారు. ఇక్కడి రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించిన తీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్, వాటి నిర్వహణ తీరు చాలా బాగున్నాయని, వీటిని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఈ అనుభవం అమరావతి నిర్మాణంలో ఉపయోగపడుతుందని మంత్రి నారాయణ వివరించారు. అనంతరం శనివారం మధ్యాహ్నం నుండి మంత్రులిద్దరూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందంతో కలిశారు. ఆదివారం, సోమవారం ఈ బృందం దుబాయ్‌లో పర్యటిస్తుంది. అనంతరం మూడు రోజుల పాటు లండన్‌లో పర్యటిస్తుంది. లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి నార్మన్ ఫోస్టర్ బృందంతో కలిసి అమరావతి డిజైన్ల మీద చర్చిస్తారని అధికారులు తెలిపారు.