ఆంధ్రప్రదేశ్‌

ఈరిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 21: ఏడు దశాబ్దాలుగా అమలవుతున్న రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన వారికే రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే అట్టడుగు వర్గాల వారు ఎప్పటికీ అట్టడుగునే ఉంటారన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల విధానం వల్ల కలెక్టర్ కొడుకు, మనవడు కూడా ఉన్నత పదవులు పొందుతూనే ఉన్నారన్నారు.
రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడే బయట ధర్నాలు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని సరిదిద్దుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు వర్గాలకు ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా బ్రాహ్మణ కులాలను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. తొలి సారిగా రూ.500 కోట్లటో ఏర్పాటైన బ్రాహ్మణ కార్పొరేషన్‌లో ఇప్పటి వరకూ రూ.200 కోట్లు విడుదల చేయడం ద్వారా 50 వేల మందికి లబ్ధి చేకూర్చారన్నారు. సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, డైరెక్టర్లు భానుమూర్తి, ఆకెళ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అయ్యన్న