ఆంధ్రప్రదేశ్‌

పొగాకు ఉప ఉత్పత్తులతో లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, అక్టోబర్ 23: పొగాకు ఉప ఉత్పత్తుల ద్వారా మరిన్ని లాభాలు ఆర్జించవచ్చని జాతీయ పొగాకు పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్‌కె.సింగ్ అన్నారు. దేశంలో పండిస్తున్న పొగాకు పంటను కేవలం బీడీలు, సిగరెట్లు, చూయింగ్‌గమ్ తయారీకి మాత్రమే పరిమితం చేయరాదన్నారు. పొగాకు ఉప ఉత్పత్తులను అనే్వషించి రైతులకు దారి చూపిస్తే పొగాకు సాగుతో రైతులు మరిన్ని లాభాలు ఆర్జిస్తారన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ పొగాకు సదస్సులో ఆయన మాట్లాడుతూ పొగాకు నుంచి నికోటిన్‌ను వేరుచేయడం ద్వారా, 40కి పైగా ఔషధాలను తయారుచేసే అవకాశాలు ఉన్నాయన్నారు. పొగాకు విత్తనాల నుంచి గుజరాత్ రాష్ట్రంలో వంటనూనె తయారుచేస్తున్నారన్నారు. ఈ నూనె వాడడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందన్నారు. దీన్ని పరిశోధనా పూర్వకంగా నిరూపించారన్నారు. ఈ నూనెను ప్రాచుర్యంలోకి తీసుకువస్తే పొగాకు నూనెను వాడడం పెరుగుతుందన్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. అంతేగాక పొగాకు మొక్క కాండం నుంచి కూడా ఉప ఉత్పత్తుల తయారీకి ఆస్కారం ఉందన్నారు. మరేదేశంలో లేనట్టుగా భారతదేశంలో 93 రకాల పొగాకు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఎఫ్‌సివి పొగాకు 40 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం ఇటీవల విడుదల చేసిన నంద్యాల పొగాకు-1 రకం రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు.