ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న డెంగ్యూ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా పెరిగాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, పథకాల అమలుపై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నోడల్ ఆఫీసర్స్‌తో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో డెంగ్యూ కేసులు తగ్గాయని, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువ అయ్యాయన్నారు. గత వారంలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 272 నమోదు కాగా, ఈ వారం 305 కేసులు నమోదయ్యాయన్నారు. మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు జోన్-2,3లలో పనితీరు బాగాలేదని, ఓపి తక్కువగా ఉంటోందన్నారు. 15 సిహెచ్‌సీలను కొత్త శానిటేషన్ పాలసీ కిందకు తీసుకొన్నామని, త్వరలో రాష్ట్రంలో కొత్తగా 14 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామన్నారు. అనంతపురంలో నమోదవుతున్న ఆంత్రాక్స్ ప్రాణాంతకం కాదని, క్యూటోనియస్ ఆంత్రాక్స్ చర్మంపై వచ్చేదని వివరించారు. ఆంత్రాక్స్ కేసులపై పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డితో మాట్లాడానని, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు గుర్తించిన గ్రామాల్లోని పశువులకు వ్యాక్సిన్ వేయాలని మంత్రి ఆదేశించారని తెలిపారు. విజయవాడ వాంబేకాలనీలో 21.52 లక్షల దోమతెరలను మంగళవారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరిలో ఎయిమ్స్ పనులు బాగా జరుగుతున్నాయని, బుధవారం గుంటూరు కలెక్టర్ సమక్షంలో ఎయిమ్స్ పనులపై నిర్మాణ స్థలంలో సమీక్ష చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుపై మినహాయింపు ఇవ్వాలన్న వైకాపా నేత జగన్ అభ్యర్థనకు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు.