ఆంధ్రప్రదేశ్‌

అయోవా విశ్వవిద్యాలయ సాంకేతిక సహకారంతో కర్నూలులో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సాంకేతిక సహకారంతో కర్నూలు జిల్లాలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.680 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయోవా విశ్వవిద్యాలయం సందర్శించి వచ్చిన తరువాత మంత్రి సోమిరెడ్డి సోమవారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, అయోవా విశ్వవిద్యాలయం, వ్యవసాయ ఉత్పత్తిదారుల సహకారంతో ఏర్పాటుచేసే ఈ కేంద్రానికి తొలి విడతగా రూ.150 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి తన అయోవా పర్యటన విజయవంతంగా ముగిసినట్లు చెప్పారు. ఆ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం ఉన్నట్లు తెలిపారు. అక్కడ 300 రకాల విత్తనాలు, 350 రకాల వ్యాధులపై పరిశోధన చేస్తారని తెలిపారు. ఆ విశ్వవిద్యాలయం 80 దేశాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 15 నుంచి 17 వరకు 3రోజులపాటు విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఆ సదస్సు ముగింపు రోజు బిల్‌గేట్స్ వస్తారని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7లక్షల 89వేల రైతుల ఖాతాలకు రూ.761.94 కోట్ల రుణ (అసలు) మాఫీ, పది శాతం వడ్డీ కింద రూ.152.39 కోట్లు జమ చేసినట్లు వివరించారు. మొత్తం రూ.914.33 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రెండవ దఫా తీసుకోనివారికి కూడా ఈ దఫా చెల్లించినట్లు చెప్పారు. ఈనెల 25న కడప జిల్లాలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, మిగిలిన జిల్లాల్లో కూడా తేదీలు ప్రకటించామని చెప్పారు. ఎటువంటి అవకతవకలు లేకుండా రాష్ట్రంలో రుణమాఫీ జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. 2007-08లో రుణమాఫీ చేశారని, రూ.120 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు.