ఆంధ్రప్రదేశ్‌

త్వరితగతిన నిరుద్యోగ భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: నిరుద్యోగ భృతి చెల్లింపునకు వీలైనంత త్వరగా తుదిరూపు తీసుకురావాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో నిరుద్యోగ భృతికి సంబంధించి విధాన రూపకల్పనపై ఆయన సోమవారం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి చెల్లింపునకు అర్హత, ప్రాతిపదికను ఖరారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయసు, విద్యార్హత, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో అప్రంటీస్ ప్రోగ్రాం కింద తీసుకునే విధంగా కూడా దృష్టి సారించాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయాలన్నారు. వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో నిరుద్యోగుల సంఖ్య ఖరారు చేయాలన్నారు. అధార్ కార్డును ఉపయోగించి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసే విధంగా ఒక ప్రక్రియ సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలు తరువాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సిఎం విదేశీ పర్యటన నుంచి వచ్చే నాటికి ఈ పథకానికి సంబంధించి ప్రణాళిక కొలిక్కి తీసుకురావాలన్నారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావ. పాల్గొన్నారు.
స్వయంగా పర్యవేక్షిస్తున్నా
గ్రామాల్లో ఎల్‌ఈడి బల్బులు అమర్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ప్రతిరోజూ ఎన్ని లైట్లు అమరుస్తున్నారు.. ఎన్ని లైట్లు పని చేస్తున్నాయి.. తదితర వివరాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారలతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎల్‌ఈడి బల్బులు అమర్చడం, ఎల్‌ఈడి బల్బుల నాణ్యత, పనితీరు, తదితర అంశలాపై నెడ్‌క్యాప్, ఈఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని వారి సహకారంతో వచ్చే నవంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తిచెయ్యాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఎల్‌ఈడి లైట్లు అమర్చడం, సిసిఎంఎస్ ద్వారా వాటిని అనుసంధానం చేయడం వెంటనే జరగాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి 30 మీటర్లకు ఒక బల్బు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోల్స్ లేనిచోట కొత్తగా పోల్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు. ఎల్‌ఈడి బల్బులు అమర్చడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. వాటి పర్యవేక్షణ బాధ్యత పదేళ్లపాటు అధికారులపైనే ఉంటుందన్నారు. ప్రతిరోజూ సాయంత్రానికి ఎన్ని లైట్లు బిగించారు, గ్రామాల్లో ఎన్ని ఎల్‌ఈడి లైట్లు వెలుగుతున్నాయి, వెలగని లైట్లు వాటికి గల కారణాలు రియల్ టైంలో తెలిసే విధంగా పంచాయతీరాజ్ డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చెయ్యాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు, ట్రాన్స్‌కో విజయానంద్, ఈఎస్‌ఎస్‌ఎల్, నెడ్‌క్యాప్ ప్రతినిధులు పాల్గొన్నారు.