ఆంధ్రప్రదేశ్‌

ఏకకాల ఎన్నికలు సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, అక్టోబర్ 23: రాజ్యాంగంలో సవరణ తీసుకువస్తే దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ సాధ్యమేనని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికలాధికారి భన్వర్‌లాల్ అభిప్రాయ పడ్డారు. సోమవారం ఆయన కుటుంబంతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఏకకాల ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న చర్చకు సంబంధించి అడిడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఏకకాల ఎన్నికల అంశం ప్రభుత్వం పరిధిలో ఉందని ఆయన అన్నారు. శతం శాతం ఓటరు నమోదు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నమోదు దాదాపు పూర్తవుతోందన్నారు. మహా నగరాలలో కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే శత శాతం ఓటర్ల నమోదుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూరె్తై ఆధార్ అనుసంధనం చేస్తే ఎక్కడి నుండైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకు ముందు ఆయన సింహాచలేశుడ్ని దర్మించుకున్నారు. దేవాలయ అధికారులు భన్వర్‌లాల్ దంపతులకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్నాక స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తర శతనామార్చన చేసి ఆశీర్వర్వాదించి సింహాచలేశుని చిత్ర పటం, ప్రసాదాలను అందజేసారు.