రాష్ట్రీయం

ఉమ్మడి వైద్య సీట్ల పరిధిలోకి రావడం తెలుగు రాష్ట్రాలకు మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: జాతీయ స్థాయిలో ఉమ్మడి (సెంట్రల్ పూల్) వైద్య సీట్ల పరిధిలో చేరాలని ఎపి, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించడం పట్ల లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు మేలే జరుగుతుందని, ప్రభుత్వాల తీరు అభినందనీయమని అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మన విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా జాతీయ ఉమ్మడి పరిధిలో చేరాలని తాను పలుసార్లు అసెంబ్లీలోనూ, బైటా కోరానని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంవల్ల అవరోధాలేవీ లేవని స్పష్టమైనందున జాతీయ స్థాయి ఉమ్మడి వైద్య సీట్లలో చేరే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తడబడకుండా తొలిదశలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్థిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిపుణులతో చర్చించి తగిన మార్గదర్శకాలు రూపొందించాలని జెపి తెలిపారు.