రాష్ట్రీయం

నకిలీ డీడీల కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, మే 31 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకిలీ డీడీల కుంభకోణంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు ఏడేళ్లు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్‌తో పాటు మరో ఆరుగురికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ మంత్రి మహమ్మద్‌షాకీర్, దినేష్ దయాళ్‌దాస్ మల్కానీ అలియాస్ ప్రదీప్‌దస్సానీ, చెరుకు ఉదయ్‌కుమార్ అలియాస్ ప్రకాష్‌రెడ్డి, కాసుల నరేంద్రకుమార్, సునీల్‌కుమార్, కుంచం భూపాల్, ఉమేష్ జగన్నాథ్ అన్వాకర్ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో 4 డీడీ బుక్కులను ఆ బ్యాంకు మేనేజర్ మద్దూరు చెన్నారెడ్డి సహకారంతో దొంగలించారు. వాటితో నకిలీ డీడీలను సృష్టించి బ్యాంకును మోసం చేసినట్లు 1998 ఆగస్టు 6లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ హెచ్‌ఎం సూద్ ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. దాదాపు 18 ఏళ్ల పాటు విచారించిన కోర్టు ఏ-1, ఏ-2 ముద్దాయిలైన బ్యాంకు మేనేజర్ చెన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందికుంటకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు దాదాపు రూ. 13 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పులో వెలువరించింది. ఇక మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్‌తో పాటు మరో ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

చిత్రం కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్