ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: 2019 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయటంతో పాటు 30లక్షల ఎల్‌ఈడీ వీధి బల్బులు అమర్చుతామని, ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండేలా 4వేల 500 గ్రామాలకు ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో డాక్టర్ బి జయనాగేశ్వరరెడ్డి, తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత, తదితరులు అడిగిన పలు ప్రశ్నలపై అరగంటకు పైగా జరిగిన చర్చలో మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల అభివృద్ధికి ముందెన్నడూ లేనివిధంగా రాజకీయాలకు అతీతంగా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నందున సకాలంలో నిధులు ఖర్చుచేయని సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు. అనేక గ్రామాల్లో రోడ్లపైనే చెత్తాచెదారం కనిపిస్తోందని, డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయన్నారు. అత్యాధునిక యంత్రాలతో డ్రైన్లు పరిశుభ్రం చేసేలా, రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఇంటికీ పొడి, తడి చెత్త సేకరణకు రెండు డస్ట్‌బిన్లు అందించి నిర్ణీత సమయంలో చెత్త సేకరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తడి చెత్తను వర్మీ కంపోస్ట్ ప్లాంట్లకు తరలించడం ద్వారా 2019 మార్చి మాసాంతానికి వెయ్యి కోట్లు సమీకరించాలనేది తమ ఆలోచనగా మంత్రి చెప్పారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఇక తమ కార్యాలయాల నుంచి ఏ గ్రామంలో ఏ వీధిలో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఏ ఇంటి వద్ద ఏ సమయంలో చెత్త సేకరిస్తోందీ ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని ఆయనన్నారు. ప్రభుత్వపరంగా ఇక ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ముందుగా ఎస్సీ కాలనీ నుంచే ప్రారంభించనున్నామన్నారు. గ్రామాల్లో 4వేల 860 కి.మీ.ల రోడ్ల నిర్మాణంలో రూ. 2వేల 49 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2014 మార్చి నాటికి 22వేల కి.మీ.ల పొడవులో సీసీరోడ్ల నిర్మాణం జరిగి గత మూడేళ్లలో రూ. 3వేల 345కోట్ల వ్యయంతో 13వేల 725 కి.మీల రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. గత మూడేళ్లలో రూ.1855 కోట్ల వ్యయంతో 6వేల 650 జనావాసాలకు మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. పలు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందంటూ పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. రోడ్లతో పాటు డ్రైన్ల నిర్మాణాలను కూడా ఒకేసారి చేపట్టాలని అనిత, ఆంజనేయులు, సూర్యారావు, తదితరులు కోరారు. 5వేలకు పైగా జనాభా కలిగిన గ్రామాలన్నింటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామన్నారు.