ఆంధ్రప్రదేశ్‌

మండలి చైర్మన్‌గా ఫరూఖ్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండి ఫరూఖ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కేవలం ఫరూఖ్ ఒక్కరే దాఖలు చేయడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఆయన శాసన మండలి చైర్మన్ పదవికి నామినేషన్ పత్రం పూర్తి చేయగా దానికి మంత్రి లోకేష్ బలపరిచారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఫరూఖ్‌కు శాసనమండలి డిప్యూటీస్పీకర్‌గా పని చేసిన అనుభవం నేడు ఏపి శాసన మండలిలో ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా ఫరూఖ్ నామినేషన్ అందించిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.