ఆంధ్రప్రదేశ్‌

తెనాలి సబ్ ట్రెజరీలో అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: తెనాలి సబ్ ట్రెజరీలో మరణించిన మహిళ పేరిట పింఛన్‌తో పదేళ్లపాటు దాదాపు 12లక్షల రూపాయలు పైగా దోపిడీ జరిగిన ఘటనపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ట్రెజరీశాఖ డైరక్టర్ టి.మోహనరావు మంగళవారం గుంటూరు జిల్లా ట్రెజరీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి భార్య కోట కృష్ణమ్మ కుటుంబ పెన్షన్ పొందుతూ 2007లో మరణించింది. అయితే ఆమె కుమారుడు సమాచారాన్ని ట్రెజరీ కార్యాలయానికి తెలియచేయకుండా ప్రతి ఏటా ఫోర్జరీ సంతకాలతో పోస్ట్‌లో లైఫ్ సర్ట్ఫికెట్ పంపుతూ ప్రతి నెలా బ్యాంక్ ఏటిఎం నుంచి పింఛన్ డ్రా చేసుకుంటూ వస్తున్న విషయం వెలుగుచూసిన విషయం తెలిసిందే. తెనాలితో పాటు అవినీతి అక్రమాలు జరిగిన ట్రెజరీ కార్యాలయాలన్నింటిపై శాఖాపరమైన దర్యాప్తు పూర్తిచేసి ఎక్కడికక్కడ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ట్రెజరీ శాఖ భావిస్తున్నది. ఇదిలా ఉంటే బుధవారం విజయవాడలో 13 జిల్లాల ట్రెజరీ అధికారుల కీలక సమావేశం జరుగబోతున్నది.