ఆంధ్రప్రదేశ్‌

అధికారమిస్తే హామీలన్నీ అమలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 14: రాష్ట్ర ప్రజలు తనకు అధికారమిస్తే తాను ఇస్తున్న ప్రతి హామీ నెరవేర్చి తీరుతానని వైకాపా అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కడప జిల్లాలో పాదయాత్ర ముగించిన జగన్ కర్నూలు జిల్లాలోకి మంగళవారం అడుగుపెట్టారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రికి ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకున్న జగన్ ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తూ విశ్వసనీయతకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మారుపేరని, ఆయన కుమారుడిగా తాను సైతం ప్రజలు విశ్వసించేలా నడుచుకుంటున్నానని అన్నారు. తాను గత వారం రోజులుగా పాదయాత్ర చేసి వేలాది మంది ప్రజలను స్వయంగా కలుసుకున్నానని, వారిలో ఒక్కరు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయలేదని వెల్లడించారు. ప్రజా సమస్యలను విని వాటి పరిష్కారానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. తాను ఇస్తున్న హామీలపై టిడిపి నేతలు చేస్తున్న ప్రకటనలు వారిలో చెలరేగుతున్న ఆందోళనకు నిదర్శనమని తెలిపారు. తాను ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలే కాకుండా అధికారంలోకి వచ్చాక తన దృష్టికి వచ్చే సమస్యలను కూడా పరిష్కరించి తీరుతానని జగన్ తెలిపారు. తాను రైతులను కలిసిన సందర్భంలో వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని, సమయానికి సాగునీరందడం లేదని, వర్షాభావ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నామని తన దృష్టికి తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు. వారు చెబుతున్నపుడు వారి కళ్లలో నీరు చూసి తాను చలించిపోయానని పేర్కొన్నారు. రుణమాఫీ అని చెప్పిన చంద్రబాబు రైతుల రుణాల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దని, తనను విశ్వసించి అధికారమిస్తే సుపరిపాలన అందించి దివంగత నేత రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెస్తానని అన్నారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు గౌరు చరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, పార్టీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి, ఆళ్లగడ్డ పార్టీ ఇన్‌చార్జి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పాదయాత్ర ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం గ్రామం వరకు 14 కిలోమీటర్ల మేర కొనసాగింది.