ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: ప్రజలకు ఇబ్బంది కలిగించనంత వరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్‌లో ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు 50 శాతం రాయితీపై ఏర్పాటు చేసిన ఫలహారశాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పైసా డబ్బు ఆశించకుండా రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలిచ్చిన రైతులే తనకు స్ఫూర్తి అని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు వదులుకొని ఇక్కడికి రావడం కష్టమని, రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశంతో రెండో ఆలోచన లేకుండా ఇక్కడకు వచ్చిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఏమీ వసతులు లేని ప్రాంతంలో అన్నీ సమకూర్చుకుంటున్నామని, సచివాలయం మొత్తానికి ఏపీ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మనసుపెట్టి పనిచేసే వాతావరణం కల్పించామని, అన్ని డైరెక్టరేట్లకు, కమిషనరేట్లకు కూడా ఏసీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగినులతో సహా అందరు ఉద్యోగుల ఫిట్నెస్ కోసం జిమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని ఉపయోగించుకుని ఆసుపత్రులకు వెళ్లే పనిలేకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడానికి రూ. 10, 12లక్షలే కాదు, రూ. 20లక్షలైనా ఇస్తామన్నారు. ఆహారం బాగోకపోయినా, రుచిగా లేకపోయినా ఎలాంటి ఫిర్యాదు వచ్చినా మీరే బాధ్యత వహించవలసి ఉంటుందని క్యాంటీన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌ని ఉద్దేశించి సీఎం నవ్వుతూ హెచ్చరించారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఈ నెల 15న బుధవారం నుంచి 50 శాతం రాయితీపై భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. 2700 పేర్లు కంప్యూటర్‌లో నమోదు చేశామని, ప్రతి ఒక్కరికీ రోజుకు రెండుసార్లు టిఫిన్, ఒకసారి భోజనం అందజేస్తామని, అంతకుమించితే కంప్యూటర్ తిరస్కరిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, ఉద్యోగుల సంఘ నేతలు వెంకటసుబ్బయ్య, సీహెచ్‌వై యాదవ్, తదితరులు పాల్గొన్నారు.