ఆంధ్రప్రదేశ్‌

సామాజిక సేవ హిందువులందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 14: భారతదేశంలో సామాజిక సేవలో హిందువులు భాగస్వాములవ్వాలని, ప్రతి రోజూ వండే బియ్యంలో గుప్పెడు బియ్యం తీసి నెలకు సమకూరిన బియ్యాన్ని పేదలకు పంచాలని అఖిర భారత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య విఎంసి స్టేడియంలో మంగళవారం నిర్వహించిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ భారత దేశ సుపన్నదేశంగా అభివృద్ధి చెందడానికి ప్రతి హిందువుడూ కృషి చేయాలని, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావుల నిరోధానికి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల అమలుతోపాటు సామాజిక బాధ్యతగా గుప్పెడు బియ్యాన్ని తీసి నెలకు సమకూరిన మొత్తం బియ్యాన్ని నిరుపేదలకు పంచి పెడితే వారి ఆకలి తీర్చిన వారిమే కాకుండా ఆకలి చావుల నియంత్రణకు దోహదపడిన వారవుతామన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతుల ప్రోత్సాహకాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, అనారోగ్య సమస్యల పరిష్కారంలో తగిన సహాయ సహకారాలందించడం వలన హిందూ సమాజం మరింత అభ్యున్నతి చెందుతుందని సూచించారు. సామాజిక సేవలలో భాగస్వాములవడమే కాకుండా భారత దేశ హిందువులే కాకుండా ప్రపంచ హిందువుల ఆకాంక్షగా ఉన్న ఆయోధ్యలోని రామాలయ నిర్మాణం పూర్తవ్వాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలన్నారు. అలాగే భారత దేశానికి కిరీటంగా ఉన్న కాశ్మీర్ రాష్ట్రంలో అల్లర్లు రూపుమాపి శాంతియుత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తొగాడియా శివ పార్వతుల కల్యాణంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగిన కల్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.