ఆంధ్రప్రదేశ్‌

తీర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలోని నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బోటు ప్రమాదాల నివారణపై ఇరిగేషన్, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, టూరిజం, విపత్తుల నివారణ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంపై దినేష్‌కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరక్కూడదని, ఇందుకోసం ఆయా పర్యాటక ప్రాంతాల వద్ద అధికారులు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నదీ తీరాల్లో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల వద్ద ఇరిగేషన్, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, టూరిజం, విపత్తుల నివారణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర సంస్థలు బోటు షికారు నిర్వహిస్తున్న తీరును అధ్యయనం చేయాలన్నారు. విజయవాడలోని ఫెర్రి ఘాట్ వద్ద బోట్ల నిర్వహణపై అధికారుల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉపయోగించే బోట్లకు ఫిట్నెస్ సర్ట్ఫికెట్ల జారీ బాధ్యతను గుర్తింపు పొందిన సంస్థకు, బాధ్యులైన వ్యక్తులకు గానీ అప్పగించాలని ఆదేశించారు. లైసెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నదిలో గాని, ఇతర జలమార్గాల్లో గాని పడవ నడిపే విధానంపై, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల ప్రాణ రక్షణకు తీసుకునే చర్యలపైనా బోటు డ్రైవర్లకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో శిక్షణ ఇప్పించాలన్నారు. బోటులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా అందజేయాలని దినేష్‌కుమార్ ఆదేశించారు. పరిమితికి మించి ప్రయాణికులను బోటులోకి అనుమతించరాదన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న ప్రతి బోటు సమాచారాన్ని జీపీఎస్ విధానం ద్వారా ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు.