ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీలపై అదే నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 16: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించినవే కాకుండా వివిధ ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా సాలీనా వేలాది కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగే ట్రెజరీ కార్యాలయాల పట్ల ఆర్థికశాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ట్రెజరీ కార్యాలయాల ద్వారా వందల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. అవినీతి అధికారులు, సిబ్బంది కుమ్మక్కయి అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు సంబంధించిన సొమ్మును తమ బినామీ ఖాతాలకు యథేచ్ఛగా మళ్లించుకుంటూ పోతున్నారు. ఇన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నా గడచిన ఏడాదిలో తొలిసారి ఒక్క తెనాలిలో జరిగిన రూ.13 లక్షల స్కామ్‌పై మాత్రం క్రిమినల్ కేసుకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతరత్రా శాఖాపరమైన దర్యాప్తులు జరుగుతున్నాయి కానీ, ఏ ఒక్క ఘటనపై కానీ, ఏ ఒక్కరినైనా బాధ్యులను చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ స్కాంలు ఇలా ఉంటే రాష్ట్రంలోని 13 జిల్లా ట్రెజరీలు, 350 సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో లక్షలాది రూపాయల విలువైన దశాబ్దకాలం క్రితమే కాలం చెల్లిన రూ.100, రూ.50, రూ.20, రూ.10లు, రూ.5లు రిజిస్ట్రేషన్ స్టాంపులు మగ్గిపోతున్నాయి. అబ్దుల్ కరీం తెల్గీ స్కాంలో దేశవ్యాప్తంగా వందలు, వేల కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ స్టాంపులను విచారణ అనంతరం నాటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై వంద రూపాయల పైబడిన స్టాంపులన్నింటినీ ఆయా ట్రెజరీ కార్యాలయాల్లో తగులబెట్టారు. రూ.100ల లోపు స్టాంపులు మాత్రం ట్రెజరీల్లోనే మూలుగుతున్నాయి. అక్కడక్కడ వాటి ఆధారంగా కూడా పాత తేదీలతో లావాదేవీలు నడిచాయనే విమర్శలు లేకపోలేదు. ఇదిలా ఉంటే పొదుపులో భాగంగా ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాల్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయాల వద్దనే పోలీస్ భద్రత కొనసాగుతోంది. మూడు షిఫ్టుల్లో షిఫ్టుకు ముగ్గురేసి చొప్పున 12 మంది విధులు నిర్వర్తిస్తుంచే, 350 సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో మాత్రం ఎలాంటి భద్రత లేదు. కనీసం వాచ్‌మెన్ కూడా ఉండటం లేదు. ప్రధానంగా ట్రెజరీ కార్యాలయాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల్లో వివాదాల్లోని వందలు, వేల కోట్ల రూపాయల విలువైన బంగారం, అన్నింటికీ మించి కీలకమైన కోర్టు డాక్యుమెంట్లు ఉంటున్నాయి. వీటికి తోడు వివిధ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు వంటి కీలకమైనవి ఉంటున్నా కనీస భద్రత లేదంటున్నారు. ఇక ఏడాదికోసారి మొక్కుబడిగా తనిఖీలకు వచ్చే అధికారులకు స్ట్రాంగ్‌రూమ్‌ల్లోని కాలం చెల్లిన స్టాంప్ పత్రాలను లెక్కించుకోటానికే అత్యధిక సమయం పడుతుంటే.. ఇతర పద్దుల కింద బాహాటంగా జరుగుతున్న అవినీతి అక్రమాలను ఏ మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇంత బాహాటంగా ట్రెజరీల్లో అక్రమ మార్గాల్లో బినామీ ఖాతాలకూ నిధులు మళ్లుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ వర్గాల నుంచే మరో వాదన వినిపిస్తున్నది. జిల్లా ట్రెజరీల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో కాలం చెల్లిన రిజిస్ట్రేషన్ స్టాంపులు మినహా విలువైనవి ఏవీ లేవంటున్నారు. గతంలో ప్రశ్నాపత్రాలు ఉండేవి. గత కొనే్నళ్లుగా వాటిని సమీప పోలీస్ స్టేషన్లలోనే భద్రపరుస్తున్నారు. కోర్టు వివాదాలకు సంబంధించిన విలువైన వస్తువులను కూడా ఉంచడం లేదన్నారు. అయితే ప్రతి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి ఆరుగురు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిమిత్తం నెలకు కనీసం మూడు లక్షల రూపాయల చొప్పున సాలీనా 36 లక్షలు.. ఇలా 13 జిల్లాల ట్రెజరీలకు సంబంధించి నాలుగున్నర కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేయాల్సి వస్తున్నదంటున్నారు. ఈ విషయంపై విశాఖజిల్లా ట్రెజరీ అధికారి సుధాకర్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో రూ.100ల పైబడిన స్టాంప్‌లన్నింటినీ తగులబెట్టామన్నారు. మిగిలిన స్టాంప్‌ల పరిస్థితిపై నేటివరకు తమకెలాంటి ఆదేశాలు రానందున జాగ్రత్తగా భద్రపరుస్తున్నామన్నారు. ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహనరావు మాట్లాడుతూ ఈ స్టాంప్‌ల విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎంత విలువైన స్టాంప్‌లు ఉన్నాయో ఇప్పటికిప్పుడు చెప్పలేనన్నారు.