ఆంధ్రప్రదేశ్‌

ఈనామ్‌తో సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ మార్కెటింగ్ విధానం బాలారిష్టాలను అధిగమించి సత్ఫలితాలను ఇస్తోంది. గుంటూరు మిర్చి యార్డులో పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో మిర్చి ధరల విషయమై రైతులకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు అందుతన్నాయి. దీంతో ధరల్లో హెచ్చు తగ్గులకు అనుగుణంగా రైతులు సరకును విక్రయిస్తున్నారు. ఏరోజు ఏ యార్డులో ఎంత ధరకు ఏ వ్యాపారి కొనుగోలు చేసిందీ పూర్తి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు కోల్డు స్టోరేజీలలో పదిలక్షల క్వింటాళ్లకు పైగా సరకు నిల్వ ఉంది. ఈనామ్ విధానంతో అటు వ్యాపారులు, ఇటు రైతులకు ప్రయోజనకరంగా ఉండటంతో సమస్య తీరినట్లయిందని గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది సీజన్‌లో రైతు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుధర ప్రకటించాయి. అయిన ప్పటికీ సరైన ధరలేక ఏదోధరకు విక్రయించారు. గత ఏడాది విస్తీర్ణం కూడా పెరిగింది. దీనివల్ల ధరలు పతనమై మిర్చిరైతు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిందనే సమాచారంతో వ్యాపారులు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈనామ్‌లో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధరలు నిర్ణయించి లావాదేవీలు నడుపుతున్నారు. ఎగుమతులకు గిరాకీ ఏర్పడింది. సింగపూర్, చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మిర్చి యార్డులోనే ఆరువేల కోట్లకు పైగా ఏటా టర్నోవర్ ఉంటుంది. ఎగుమతుల ద్వారా 25 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు సమకూరుతోంది. ఈనామ్ విధానంలో తేజ, బాడిగ రకాల నాణ్యమైన మిర్చికి క్వింటాల్‌కు రూ. 12 నుంచి 15 వేల లోపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈనామ్‌పై వ్యాపారుల డిమాండ్లకు తలొగ్గకుండా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడంతో పాటు రైతుకు మద్దతుధర కల్పించాలనే ప్రయత్నాలు నెరవేరుతున్నాయని యార్డు చైర్మన్ మన్నవ స్పష్టంచేశారు. మిర్చి ధరలు పెరగడంతో తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన రైతులు కోల్డుస్టోరేజీలలో నిల్వచేసిన సరకును విక్రయించేందుకు పరుగులు తీస్తున్నారు. ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు కొనసాగితే ఈ సీజన్ గట్టెక్కినట్లే అనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.