ఆంధ్రప్రదేశ్‌

బోటింగ్ ఆపరేషన్లపై మార్గదర్శకాలు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 16: కృష్ణానది పవిత్ర సంగం వద్ద బోటు బోల్తా ఘటన నేపథ్యంలో బోటింగ్ ఆపరేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పర్యాటక, ప్రయాణికుల, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌కు సంబంధించి బోటింగ్ ఆపరేషన్లకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. 1890లో రూపొందించిన చట్టం ప్రకారం లైసెన్సుగా వ్యవహరించే ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్, రూట్ అనుమతులను జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇప్పటివరకూ జారీ చేస్తున్నారు. సంవత్సర కాలపరిమితి కలిగిన ఈ లైసెన్సులతో కృష్ణా, గోదావరి నదుల్లో ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. బోటింగ్ కార్యకలాపలపై నిఘా ఉంచేందుకు వీలుగా జిల్లా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిపి జిల్లా స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆ జీవోలో ఆదేశించారు. ఇప్పటి వరకూ లైసెన్సు పొందిన బోట్ల వివరాలను ఈ కమిటీకి జలవనరుల శాఖ అందచేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య, లైఫ్ జాకెట్లు, నిబంధనల అమలు, తదితర అంశాలను పరిశీలించేందుకు అన్ని బోట్లలో ఈ కమిటీ తనిఖీలు నిర్వహిస్తుంది. అయిదుగురు ప్రయాణికులకు ఒక బోయ్(నీటిలో తేలియాడే బంతిలాంటి పరికరం), అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, నేవిగేషన్ పరికరాలు కూడా తనిఖీ చేస్తారు. తనిఖీ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ బోటుకు సేఫ్ బోట్ సర్ట్ఫికెట్‌ను జలవనరుల శాఖ మంజూరు చేస్తుంది. ఈ సర్ట్ఫికెట్ ప్రముఖంగా కనబడేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా ఉంటేనే బోటు నడిపేందుకు అనుమతిస్తారు. 15 రోజుల్లో బోట్ల తనిఖీ చేసి సర్ట్ఫికెట్లను జారీ చేస్తారు. కలెక్టరు, జల వనరుల శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి బోట్లను తనిఖీ చేయలి. నీటిలో తేలియాడే బోయ్స్‌ను బోట్లు ప్రయాణించే దారిలో ఉన్న రాళ్లు, ఇసుక మేట వంటి ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. పోలీసు, జలవనరుల శాఖ, పర్యాటక శాఖ వద్ద కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, కమ్యూనికేషన్, జీపీఎస్ వ్యవస్థను బోటు నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. భద్రత, ప్రయాణికుల సంఖ్య పరిశీలించాకే కంట్రోల్ రూమ్‌ల నుంచి ఆ బోటు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. నదులు, కాలువలు, రిజర్వాయర్లు, తదితర వాటర్ బాడీస్‌లో తిరిగే సరకు, ప్రయాణికుల బోట్లకు ఈ నిబంధనలు వర్తింప చేస్తూ ఉత్తర్వులను గురువారం ప్రభుత్వం జారీ చేసింది.