ఆంధ్రప్రదేశ్‌

ఏసీబీ వలలో ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: లంక భూమి సాగుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ జలనవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి.. రాజమహేంద్రవరం కోటిలింగాలపేటకు చెందిన గిరిధర్ అనే ఆసామి అంబేద్కర్ చైతన్య సొసైటీకి గోదావరి గర్భంలోని 3.60 ఎకరాల లంక భూమిని సాగు చేసుకునేందుకు ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ నుంచి జలవనరుల శాఖ హెడ్ వర్క్సు విభాగానికి దరఖాస్తుచేరింది. కలెక్టర్ ఆదేశం మేరకు ఈ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అయితే ఈ భూమిని సాగుకు అనుమతివ్వడానికి అఖండ గోదావరి నది ఎడమ గట్టు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సీతానగరం వరకు పరిధి ఏఈ సాధనాల కొండలరావు ఎన్‌వోసీ ఇవ్వాల్సివుంది. అయతే ఎన్‌వోసీ ఇవ్వడానికి ఏఈ కొండలరావు రూ.10 వేలు లంచం అడిగారు. దీనితో లబ్ధిదారుడు గిరిధర్ రాజమహేంద్రవరం ఏసీబీ అధికార్లను ఆశ్రయించారు. ధవళేశ్వరంలోని ఎఫ్‌సీఐ గోదాము వద్ద శుక్రవారం గిరిధర్ నుండి రూ.10వేలు లంచం తీసుకుంటున్న ఏఈ కొండలరావును ఏసీబీ డిఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కేసు నమోదు చేసి ఏఈ కొండలరావును ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.
అయితే గిరిధర్ వద్ద తాను అప్పుగా రూ.10వేలు తీసుకున్నానని ఏఈ చెబుతున్నారు.