ఆంధ్రప్రదేశ్‌

ఒక్క చాన్స్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, నవంబర్ 19: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీత పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 12వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో సాగింది. సాయంత్రం బనగానపల్లె సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణమాఫీ, యువతకు ఉద్యోగాలంటూ అమలుకాని హామీలిచ్చి, నాలుగేళ్ల తరువాత కూడా ఏ ఒక్కటీ అమలుచేయక మోసం చేశారన్నారు. రాజకీయాల్లో మోసం, అవకాశవాద విధానం ఉండకూడదన్నారు. ఇప్పుడు జరగాల్సిన అభివృద్ధి గురించి చంద్రబాబు పెదవి విప్పకుండా, 2022, 29, 50 నాటికి చేసేది చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీమలో కోస్తా గురించి, కోస్తాలో సీమ గురించి అబద్దాలు చెబుతూ అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా మోసం, అబద్దాలు, అవినీతినికి తగిన బుద్ది చెప్పాలన్నారు. వర్గీకరణ చేస్తామని మాదిగలను, బీసీల్లో చేరుస్తామని కాపులను.. ఇలా కులాలు, మతాల వారీగా ప్రజలకు అబద్దాలు చెప్పడంతోనే బాబు నాలుగేళ్ల పాలన ముగుస్తోందన్నారు. అభివృద్ధిలో కాకుండా రైతులు అప్పులపాలు కావడానికి, రాష్ట్రంలో అవినీతి పెరగడానికి, మద్యం విక్రయాలు పెరగడానికి, విద్యార్థుల ఫీజుల ఎగవేత, అనారోగ్య పరిస్థితులు, అబద్దాలు చెప్పడంలో బాబు రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని నాయకులు పాలనకు అనర్హులని, అలాంటివారు వెంటనే దిగిపోయాలన్నారు.
తన తండ్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి 85 శాతం ప్రాజెక్టులు పూర్తిచేస్తే మిగిలిపోయిన 15 శాతం పనులను ఈ ప్రభుత్వం నాలుగేళ్లయనా పూర్తి చెయ్యలేకపోతోందని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడిగట్టు కాల్వ ద్వారా 140 టీఎంసీ నికరజలాలు రావాల్సి ఉందని, 11 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అక్కడి రైతులు వరి పైరు ఇంతవరకు వేయలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు నీరు వదలడంతో అక్కడి రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎమ్మెల్యేల బృందాన్ని పంపించి వారితో అబద్ధపు ప్రకటనలు చేయించారని విమర్శించారు. ఇలాంటి సిఎం మనకు అవసరమంటారా? అని ప్రశ్నించారు. రాయసీమ బిడ్డనైన తనపై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువలేనన్నారు. సంకల్పయత్రలో తనతోపాటు వేలాది అడుగులు నడిచి సంఘీభావం ప్రకటించిన తీరు అమోఘమన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని, ఆ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే నవరత్నాల కింద ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పక అమలు చేస్తామన్నారు. వైసీపీకి అధికారం కట్టబెడితే ప్రతి ఏడాది జూన్‌లో రైతులకు రూ.12,500 వారి బ్యాంకుఖాతాలో జమచేస్తామన్నారు. పప్పు శెనగకు రూ.8వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని, అలాగే అన్ని పంటలకు ముందే వాటి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్నారు. మార్పుకోసం తమకు అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మాదిరి ఎక్కువ పేజీలు లేకుండా కేవలం 2, 3 పేజీలకే పరిమితం చేస్తామన్నారు.
12వ రోజు పాదయాత్ర
ప్రజా సంకల్పయాత్ర 12వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదినె్న గ్రామం నుంచి ప్రారంభమైంది. బనగానపల్లె మండలం గులాంనబిపేట, ఇల్లూరు కొత్తపేట మీదుగా సాగింది. కొత్తపేట వద్ద కుమ్మరి సారె తిప్పిన జగన్ కుండ తయారు చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం యాత్ర కొనసాగింది. సాయంత్రం బనగానపల్లెకు చేరుకుంది.
చిత్రం..ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బనగానపల్లె మండలం కొత్తపేటలో కుమ్మరి సారె తిప్పుతున్న జగన్