ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి పంపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయని ఎపి ఉద్యోగులు కొందరు గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చెప్పారు. అమరావతి వెళ్లేందుకు ఇష్టపడని ఎపి ఉద్యోగులు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరిని , బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లను కలిసి ఐదు పేజీల వినతి పత్రం ఇచ్చారు. తాత్కాలిక రాజధానికి ఉద్యోగులను తరలించకుండా చొరవ తీసుకోవాలని వారు పురంధ్రీశ్వరిని కోరారు. తాత్కాలిక రాజధాని వద్దు, శాశ్వత రాజధాని ముద్దు అని వారు పేర్కొన్నారు. నేరుగా తమను అమరావతికి తీసుకువెళ్లాలని వారు చెప్పారు. వారి వ్యాఖ్యలపై స్పందించిన పురీంధ్రీశ్వరి రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర విభజనకు ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని అన్నారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఇబ్బందులు తప్పడం లేదని, పిల్లల భవిష్యత్ గురించి ఉద్యోగులు ఆవేదన పడుతున్నారని అన్నారు. ప్రణాళికా బద్ధంగా వెళ్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని, ప్రస్తుతం ఇళ్ల అద్దెలు అందనంత ఎత్తుకు వెళ్లాయని పేర్కొన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎపి అగ్రగామిగా ఎదగాలంటే ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పురంధ్రీశ్వరి పేర్కొన్నారు.