ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఏపీఎస్‌ఆర్టీసీ సుదీర్ఘకాలంగా అంతులేని నష్టాలతో నడుస్తున్న మాట వాస్తవం.. అయితే పలు సంస్కరణలు.. పొదుపు చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లాభాలను చూపలేకపోయినా నష్టాలు లేకుండా నడపాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్టీసీ రాబడికి గండి కొడుతున్న ఆటోల అక్రమ రవాణాపై ఇక ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆర్టీసీపై లేవనెత్తిన చర్చ దాదాపు 20 నిమిషాలు పైగా రసవత్తరంగా సాగింది. జాతీయ స్థాయిలో అనేకానేక అవార్డులు సాధిస్తున్న ఏపీస్‌ఆర్టీసీ ఇంకెంత కాలం నష్టాలతో పయనిస్తుందని ప్రశ్నించారు. నష్టాల పేరిట గ్రామీణ సర్వీస్‌లను రద్దుచేయటం సరికాదన్నారు. మండల కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను బీవోటీ ప్రాతిపదికన వాణిజ్య కేంద్రాలుగా మార్చాలన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఏ గ్రామీణ సర్వీస్‌ను కూడా రద్దు చేయలేదంటుంటే సభ్యులు గొట్టిపాటి రవికుమార్, నారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, తదితరులు కల్పించుకుని అనేక గ్రామాలకు సర్వీస్‌లు రద్దు కావటం వల్లనే గ్రామీణ ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారంటూ ఏకరువు పెట్టారు. దీంతో మంత్రి కొంత తగ్గుతూ లాభదాయకం లేని కొన్ని సర్వీస్‌లను రద్దుచేసిన మాట వాస్తవమేనంటూ అంగీకరించారు. ఆలపాటి రాజేంద్రతో పాటు మరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కల్పించుకుంటూ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రికల్ చార్జింగ్‌తోకాని లేక సీఎన్‌జీతోకానీ బస్సులను నడపవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రతి ఏటా నష్టాలతో నడుస్తుంటే ఇక ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థికమేనా అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. గొట్టిపాటి రవి మాట్లాడుతూ పల్లె వెలుగు బస్సుల రద్దు వల్ల ఒక్క విద్యార్థి ఆటోలో రోజుకు రూ.10లు చొప్పున వెచ్చించాల్సి వస్తున్నదని అన్నారు. పైగా అదే ఆటోలో 20 నుంచి 30మంది ప్రయాణం చేస్తున్నారని అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ అమలాపురం-రాజోలు డిపోల మధ్య సరైన సమయానికి బస్సులు నడవటం లేదన్నారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో తగినన్ని బస్ సర్వీస్‌లు లేకపోవటం వలన భీమిలి, ఆనందపట్నం ప్రాంతాలకు విశాఖ నుంచి బస్సుల్లో ఫుట్‌పాత్‌లపై కూడా ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేస్తున్నారని అన్నారు.