ఆంధ్రప్రదేశ్‌

నన్ను నిందించి ఏం లాభం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: నేను ఎక్కడా రాజీపడను.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. హేతుబద్ధతలేదు.. అయినా కష్టాలను అధిగమిస్తున్నాం.. ప్రత్యేక హోదా డిమాండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉంది.. అది కష్టసాధ్యం..కేంద్రం అందుకు తగిన ప్యాకేజీ ప్రకటించింది.. నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిపై నన్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి లాభంలేదు..్ఢల్లీలోనే పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉపాధి హామీ పథకంపై సుదీర్ఘస్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక హోదాపై వామపక్ష పార్టీల ఛలో అసెంబ్లీ ఆందోళనపై తీవ్రంగా స్పందించారు. ప్యాకేజీ ద్వారానే హోదా సదపాయాలన్నీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో వౌలిక వసతుల కల్పన జరగాలి.. అంతా సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది..సహకరించే ఉద్దేశ్యం ఉంటే ఢిల్లీ వెళ్లి చెప్పండి..రాష్ట్రానికి లాభం జరుగుతుందంటే నేను కాదనను.. ఇప్పటికే ఏ రాష్ట్రానికి లేనివిధంగా కేంద్రం కేటాయింపులు జరుపుతోంది.. పోలవరానికి నూరుశాతం నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది.. ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నాం.. స్వయంగా నేనేవెళ్లి ప్రధానమంత్రి..కేంద్ర మంత్రులను అడుగుతున్నా.. ఇప్పటి వరకు మంజూరైన నిధులు పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి.. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని వామపక్ష పార్టీలకు హితవు పలికారు. అంతకు ముందు ఉపాధి హామీ పథకం అమలుపై స్పందిస్తూ కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం జరిగింది.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుపడుతోందని విమర్శించారు.. ఓ పధకం ప్రకారం ఆ పార్టీ ఎంపీలు ఏడాదికోసారి ఉపాధి హామీ నిధులు దుర్వి నియోగం జరుగుతున్నాయనే ఫిర్యాదులు చేయటంతో పేదల కోసం నిర్దేశించిన ఈ పథకం లక్ష్యానికి అవరోధంగా మారుతోందన్నారు. ప్రతిపక్షం బాధ్యతా రాహిత్యానికి విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది.. దీన్ని నేను గర్హిస్తున్నా.. హెచ్చరిస్తున్నా.. ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న కాలంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా గ్రామాల్లో 30 లక్షల ఎల్‌ఈడీ వెలుగులు చూడాలనేది తమ లక్ష్యమన్నారు. ఉపాధి హామీ వేతనాలలో వ్యత్యాసం నెలకొందని శాసనసభ్యులు చేసిన ప్రతిపాదనల ప్రకారం రూ. 250 చెల్లించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో పంచాయతీ, పాఠశాలలకు భవనాలు, మరుగుదొడ్లు ఉండేవి కావన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులను పాదయాత్రలో తెలుసుకున్నానని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో 8 సంవత్సరాలలో 16,540 కోట్లు కేటాయిస్తే గడచిన మూడున్నళ్లలోనే 16వేల 576 కోట్లతో పనులు చేపట్టామన్నారు. గ్రామాల్లో 9వేల 528 కిలోమీటర్ల రహదార్లు ఏర్పాటవుతున్నాయని 19లక్షల గృహాల నిర్మాణంతో పాటు ఇంటింటికీ ఫైబర్‌నెట్ అందించి ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆదాయం తీసుకు రావాలనేది తమ సంకల్పమన్నారు. 13,14 ఆర్థికసంఘాల నిధులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ విధానాన్ని అమలు చేయటం.. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం ద్వారా 2019 నాటికి ఒడీఎఫ్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామన్నారు. గ్రామాల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుందని తెలిపారు. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి ఇంటికీ 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు. ఫ్లోరైడ్ సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇంకా 150 గ్రామాలకు మంచినీటిని అందిస్తే లక్ష్యం నెరవేరుతుందన్నారు. 22 ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 2.75లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచామన్నారు. అన్ని గ్రామాల్లో వనరులు పెంచేందుకు ప్రతి ఇంటికీ విద్యుత్, వంట గ్యాస్, కుళాయి, వ్యక్తిగత మరుగుదొడ్డి, పంచాయతీ భవనాలు, ప్రతి కుటుంబానికి పదివేల ఆదాయం అనే 7 స్టార్ రేటింగ్ ఎమ్మెల్యేలకు నిర్దేశించా.. దీన్ని బట్టే పనితీరును బేరీజు వేస్తామని ప్రకటించారు.

చిత్రం..శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి