ఆంధ్రప్రదేశ్‌

హోదా మరచి అనుచిత వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 2 : తానొక ప్రతిపక్ష నేత అనే విషయాన్ని సైతం మర్చిపోయి వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ గురువారం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో విలేఖరుల సమావేశంలో సిఎం చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. మంత్రి సునీత విలేఖరులతో మాట్లాడుతూ పదేళ్ల వైఎస్ పాలనలో ఏనాడూ తాము విజ్ఞత కోల్పోయి మాట్లాడలేదన్నారు. జగన్ నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పద్ధతి మార్చుకో: జెసి ప్రభాకర్‌రెడ్డి
నీవు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు నీపై చెప్పులు వేసే రోజు ఎంతోదూరంలో లేదని తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి జగన్‌ను హెచ్చరించారు. జెసి గురువారం తాడిపత్రిలో తన నివాసంలో విలేఖరుల సమావేశంలో జగన్‌పై నిప్పులు చెరిగారు. పదజాలం మార్చుకోవాలని, మూర్ఖుడిలా మాట్లాడితే దండన తప్పదన్నారు.
జగన్ గుణపాఠం నేర్చుకోలేదు: మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గురువారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఛీత్కరించినా, ఎమ్మెల్యేలు పార్టీనీ వీడుతున్నా ఏ మాత్రం మార్పురాలేదని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణదీక్షను నయవంచక దీక్షగా జగన్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.