ఆంధ్రప్రదేశ్‌

మాటుమడుగులో వౌనిక అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డక్కిలి, నవంబర్ 23: చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న సత్యభామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని దువ్వూరు రాగ వౌనిక (19) అంత్యక్రియలు గురువారం మాటుమడుగులో జరిగాయ. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన దువ్వూరు రాజారెడ్డి వాణిశ్రీ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. వారిలో మొదటి అమ్మాయి రాగవౌనిక. రాజారెడ్డి వ్యాపారరీత్యా హైద్రాబాద్‌లో స్థిరపడ్డారు. ఇద్దరి పిల్లలైన రాగవౌనిక, రాకేష్‌లను చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చేర్పించారు. అయితే మంగళవారం ప్రారంభమైన పరీక్షల్లో రాగవౌనిక కాపీయింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఇన్విజిలేటర్లు ఆమెను బటయకు పంపారు. రెండవ రోజైన బుధవారం పరీక్షకు కూడా హాజరుకాకుండా అడ్డుకోవడంతో రాగవౌనిక మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సమాచారం తెలుసుకున్న సోదరుడు రాకేష్ హాస్టల్ గది వైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో కళాశాల యాజమాన్యం అటువైపు వెళ్లడానికి అనుమతించలేదని బంధువులు ఆరోపించారు. అయితే ఇంతలోనే రాగవౌనిక కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రాగవౌనిక మృతదేహానికి పోస్టుమార్టం చెన్నైలోనే నిర్వహించి గురువారం స్వగ్రామమైన మాటుమడుగుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.