ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్ర సాగునీటికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: పట్టిసీమతో కృష్ణాడెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిపూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. వందేళ్లకు పైగా కృష్ణానదీ జలాలతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని దాదాపు 13లక్షల ఎకరాల ఆయకట్టులో వరిసాగు జరుగుతుండగా, తొలిసారి ప్రస్తుత ఖరీఫ్‌లో పూర్తిగా గోదావరి జలాలతో నిర్ణీత కాలంలో వరినాట్లు, కోతలు, ఆపై నూర్పిళ్లు కూడా చకచకా జరిగిపోయాయి. ప్రతి జిల్లాలో ధాన్యం అమ్మకాలు కూడా సాగుతున్నాయి. ఖరీఫ్ సాగుకు పట్టిసీమ నుంచి దాదాపు 60 టీఎంసీలకు పైగా సాగునీరు అందింది. తద్వారా మిగులు జలాలను రాయలసీమకు మళ్లిస్తుండగా ఉత్తరాంధ్రలో సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు ఉత్తరాంధ్రలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను కూడా సమీక్షిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పది రోజులకోరి ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. గడచిన మూడేళ్లలో రాష్టవ్య్రాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దాదాపు 40వేల కోట్లు వ్యయం చేయగా ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఇప్పటికీ ఆరు ప్రాజెక్టులపై రూ. 900 కోట్లు ఖర్చు చేసింది.2018 జూన్ నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు మరో రూ. 2వేల కోట్లు కూడా ఖర్చు చేందుకు సిద్ధమవుతోంది. 2014 జూన్ 2 నుంచి 2017 అక్టోబర్ మాసాంతం వరకు ఎస్‌జీఎల్ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుపై రూ. 247 కోట్లు, బీఆర్‌ఆర్ వంశధార రెండోదశ రెండో ఫేజ్ కింద రూ. 430 కోట్లు, మద్దువలస రిజర్వాయర్ రెండోదశ కింద రూ. 11 కోట్లు, జంఝూవతి రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం రూ. కోటిన్నర, తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం రూ. 85 కోట్లు, మహేంద్ర తనయా నదిపై తీరప్రాంత రిజర్వాయర్ కోసం రూ. 65 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ఆరు ప్రాజెక్టుల్లో తారకరామ మినహా మిగిలిన ఐదు 2018 జూన్ లేదా నవంబర్ మాసాంతానికి పూర్తి కానున్నాయి. తారకరామ ప్రాజెక్టు 2019 జూన్ 30 నాటికి పూర్తయ్యేలా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.