ఆంధ్రప్రదేశ్‌

గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 3: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదగాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2017ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలోని తిరుపతి నగరంలో 550 కోట్లు, రాజమండ్రిలో 25 కోట్లు, విశాఖపట్నంలో 30 కోట్ల రూపాయలతో శాస్త్ర సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్టస్థ్రాయిలో 25వ జాతీయ బాలల కాంగ్రెస్ -2017ను రెండు రోజులపాటు ఒంగోలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుండి 30 నుండి 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. సుమారు 125 పరిశోధన ప్రాజెక్టులను విద్యార్థులు తయారుచేశారన్నారు. స్టాల్స్‌లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. దీనిద్వారా విద్యార్థులు తమలోని నైపుణ్యానికి పదునుపెట్టి కొత్త విషయాలను కనుగొనాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకుని ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాలు, పిడుగులు, ప్రమాదాలను ముందుగా గుర్తించడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకుని కమాండ్ కంట్రోల్ ద్వారా అధికారుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో వేసిన మొక్కలను ఒక ఫొటో తీసి యాప్‌లో ఉంచినట్లైతే దాని స్థితిగతులను వెంటనే తెలియజేస్తుందన్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఎలాంటి పనినైనా సాధిస్తారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో శాస్త్ర సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజులపాటు జరిగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలని మంత్రి శిద్దా కోరారు.

చిత్రం..ఇస్రో గురించి మంత్రి శిద్దాకు వివరిస్తున్న శాస్తవ్రేత్తలు