ఆంధ్రప్రదేశ్‌

శాడిస్ట్ భర్త రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు, డిసెంబర్ 3: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని పెద్దదామరగుంట గ్రామంలో శోభనం రాత్రి నూతన వధువును పాశవికంగా గాయపర్చిన ఘటనలో భర్త రాజేష్ (26)ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. నిందితుడు వి.కోట మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో అతనిపై కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి ప్రకటించారు. ఇదిలావుండగా శాడిస్టు భర్త చేతిలో గాయపడిన నవవధువు శైలజకు మెరుగైన చికిత్స అందించడం కోసం ఆదివారం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కంటి భాగంలో తీవ్ర గాయం కావడంతో ఆధునిక చికిత్స కోసం స్విమ్స్ కు తరలించినట్లు వారు తెలిపారు.