ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు నుంచి ‘అనంత’కు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 3 : వైకాపా అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం నాటితో కర్నూలు జిల్లాలో ముగిసింది. జగన్ రాత్రికి పత్తికొండ నియోజకవర్గంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దు గ్రామమైన చెరువుతండాలో బస చేశారు. కర్నూలు జిల్లాలో 19 రోజుల పాటు నడక సాగించిన ఆయన సుమారు 272 కి.మీ మేర ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టారు. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రజాసంకల్ప యాత్ర ముగియడంతో అనంతపురం జిల్లాలో సోమవారం ఉదయం తొలి అడుగు వేయనున్నారు.
కడప జిల్లా ఇడుపులపాయలో నవంబర్ 6వ తేదీ ప్రారంభించిన పాదయాత్ర గత 28 రోజులుగా కొనసాగుతోంది. మధ్యలో 3 శుక్రవారాలు కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన జగన్ 25 రోజుల పాటు నిరాటంకంగా పాదయాత్ర కొనసాగించారు. సగటున రోజుకు 14.5 కి.మీ మేర నడుస్తూ కడప జిల్లాలో 8 రోజుల్లో ఒక శుక్రవారం మినహా 7 రోజుల్లో 93కి.మీ మేర పాదయాత్ర నిర్వహించి 9వ రోజు నవంబర్ 14వ తేదీ ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలంలో తొలిఅడుగు వేశారు. అక్కడి నుంచి గత 19 రోజుల్లో 2 శుక్రవారాలు మినహా 17 రోజుల పాటు జిల్లాలో 272కి.మీ నడిచి పత్తికొండ నియోజకవర్గం చెరువుతండాతో కర్నూలులో ముగించారు. చెరువుతండా గ్రామం నుంచి 1 కి.మీ మేర నడిచిన అనంతరం అనంతపురం జిల్లాలో ప్రవేశించనున్నారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి జగన్ భారీగా హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా జగన్ తన యాత్రలో ఒక్క రోజు మాత్రమే సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థలపై ఆయన ఆరోపణలు చేస్తూ చంద్రబాబు ఒక దళారీ అంటూ అభివర్ణించారు.

నేటి నుంచి అనంతపురంలో 18 రోజులు.. 240 కి.మీ..

అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం అనంతపురం జిల్లాలో ప్రవేశించనుంచి. వైఎస్‌ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం కర్నూలు జిల్లాలో ముగిసింది. జగన్ సోమవారం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలంలోకి ప్రవేశించి పాదయాత్ర చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 18 రోజుల పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 కి.మీ దూరం నడవనున్నారు. జగన్ పాదయాత్ర సోమవారం ఉదయం 8.30 గంటలకు గుత్తి మండలంలోని బసినేపల్లితండా నుంచి ప్రారంభం కానుంది. బసినేపల్లిలో తొలుత జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పాదయాత్రగా గుత్తిఆర్‌ఎస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం అనంతరం 3 గంటలకు పాదయాత్ర చేపడుతారు. సాయంత్రం 4 గంటలకు గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించి రాత్రికి గుత్తిలోనే బస చేస్తారు. ఇక ఈ నెల 10వ తేదీ ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర, కూడేరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా జగన్ కాళ్లకు బొబ్బలెక్కినా వైద్యం తీసుకుంటున్నందున పాదయాత్ర సజావుగా సాగుతుందని, విరామం ఏదీ ఉండదని వైకాపా జిల్లా నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఇక పార్టీ అధినేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, గుంతకల్లు నియోజకవర్గ నాయకులు, పెద్దఎత్తున అనంతపురం-కర్నూలు సరిహద్దుకు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు పార్టీ సమన్వయకర్తలు ఇప్పటికే అక్కడికే తరలివెళ్లారు.

చిత్రం..కర్నూలు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్