ఆంధ్రప్రదేశ్‌

ఆగని ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, డిసెంబర్ 3 : అనంతపురం జిల్లాలోని కర్నాటక సరిహద్దు మండలాల్లో గత పదిరోజుల నుంచి కర్నాటక నుంచి వచ్చిన రెండు మగ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏనుగుల దాడిలో ఇప్పటికే జిల్లాలో ఒకరు మృతిచెందగా ఆదివారం డీ.హీరేహాల్ మండలం మురిడి గ్రామంలో రైతు గొల్ల ఏకాంతప్ప(45) మృతిచెందాడు. వివరాలు.. కణేకల్లు, డీ.హీరేహాల్ మండలాల్లో గత రెండు రోజుల నుంచి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రైతు ఏకాంతప్ప తన తోటలో సాగు చేసిన పంటకు కాపలా ఉండగా అకస్మాత్తుగా ఏనుగులు దాడి చేయగా అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న డిఎఫ్‌ఓ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఉలికల్లు చెరువుకు చేరుకున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో ఎనుగులు దాగి ఉన్న ప్రదేశాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కాలవ శ్రీనివాసులు రైతు ఏకాంతప్ప ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.