ఆంధ్రప్రదేశ్‌

నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగానపల్లి/తుగ్గలి, జూన్ 6: సీమలో రెండు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం జిల్లా తూముచెర్లలో సోమవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. మల్లేషు, నిర్మలమ్మ దంపతుల కుమారులు తేజ(10), తరుణ్(8) మరికొంతమంది పిల్లలతో కలిసి పారంఫాండ్‌లో నిలిచిన నీళ్లలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగారు. కాగా కర్నూలు జిల్లా లింగనేనిదొడ్డి గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. తిమ్మప్ప కూతూరు శివమ్మ(15), శ్రీనివాసులు కూతూరు పూజిత (12) లింగనేనిదొడ్డిలో పొలం పనులకు వెళ్లారు. నీళ్లకోసం సమీప బావి వద్దకు వెళ్లగా పూజిత కాలుజారి బావిలో పడింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో శివమ్మ సైతం పట్టుతప్పి నీటిలో పడింది. దీంతో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు.