ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం కలెక్టర్‌కు జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 3: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి కలెక్టర్ చేసిన కృషిని అభినందిస్తూ జాతీయస్థాయిలో పురస్కారాన్ని ప్రకటించారు. కలెక్టర్ ఈ పురస్కారం అందుకోవడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

చిత్రం..రాష్టప్రతి రామనాథ్ కోవింద్ నుంచి పురస్కారాన్ని అందుకుంటున్న కలెక్టర్ ధనంజయరెడ్డి