ఆంధ్రప్రదేశ్‌

కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 3: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీప మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్తీక పున్నమినాడు సా. 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో ఉపాలయమైన యోగ నరసింహస్వామి ఆలయం పక్కనున్న పరిమళ అరవద్ద 100 కొత్త మూకుళ్లలో నేతి దీపాలు వెలిగించారు. వీటిని ఛత్ర చామర మంగళ వాయిద్యాలతో విమాన ప్రదక్షిణంగా స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారికి హారతి పట్టారు. అనంతరం గర్భాలయం నుంచి మహాద్వారం వరకు ఆలయం వెలుపల ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం, వరాహస్వామి ఆలయం, పుష్కరణి వద్ద మంగళవాయిద్యాల మధ్య దీపాలను వెలిగించారు. పౌర్ణమి నాడు వినీలాకాశంలో చంద్రబింబం వెలుతురులో భువిపై వెలిగిన కార్తీక దీపకాంతులు భక్తుల హృదయాలను జ్ఞానజ్యోతులను వెలిగించేలా సాగాయి. ఈ కార్యక్రమంలో ఈఓ ఏకె సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఈఓ కోదండరామారావు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీకదీప వైభవం