ఆంధ్రప్రదేశ్‌

పల్లెల్లో ఇక ‘వెలుగు’ దివ్వెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలకూ విస్తరింపజేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధిదీపాల పథకం ద్వారా దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంధనం ఆదా ద్వారా ఆర్థిక లబ్ధితో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు సిద్ధవౌతోంది. పల్లెల్లో ఎల్‌ఈడీ వీధిదీపాలు వేగవంతంగా ఏర్పాటు చేయడానికి రన్ రేట్ మెకానిజం అవసరమని పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని ఎల్‌ఈడీ వీధిదీపాలున్నాయి? కొత్తగా ఎన్ని వేశారు? సమయం, గ్రామాలు, విద్యుత్ స్తంభాల వారీగా ఏర్పాటు చేసే సంస్థల ప్రతిభను మెరుగుపర్చడానికి ఇది దోహదపడుతుందని ఆయనన్నారు. ఆదివారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంధన శాఖ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ, ఇన్‌ఛార్జి సీఎండీ దినేష్ పరుచూరి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర, పంచాయతీరాజ్ కమిషనర్ బీ రామాంజనేయులు, నెడ్‌క్యాప్ వీసీ కమలాకర్ బాబు, పంచాయతీరాజ్ నోడల్ అధికారి పరదేశి కుమార్, భారత ప్రభుత్వ సంస్థ ఈఈఎస్‌ఎల్ ప్రతినిధి శశికాంత్‌లతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఎల్‌ఈడీ బల్బుల కార్యక్రమంలో ప్రధానమైన మూడో వైర్ ఏర్పాటును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన ఇంధన శాఖను కోరారు. ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో గ్రామీణాభివృద్ధిది కీలకపాత్ర అని చెప్పారు. గ్రామీణ వికాసానికి ప్రభుత్వం పెద్దఎత్తున వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టిందని, సిమెంటు రోడ్లు నిర్మిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎల్‌ఈడీ వీధిదీపాలు దోహదపడతాయన్నారు. కొత్త వీధిదీపాలు, కొత్త సిమెంట్ రోడ్లతో గ్రామాలు నూతన శోభను సంతరించుకుంటాయన్నారు. కేంద్రీయ నియంత్రిత, సమన్వయ వ్యవస్థలో ప్రపంచ స్థాయి సాంకేతికతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం డ్యాష్‌బోర్డు, తన డ్యాష్‌బోర్డుతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పనితీరు వివరాల తాజా సమాచార అంచనాకు సహకరించాలన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డులో, మంత్రి డ్యాష్ బోర్డులో ఎన్ని దీపాలు వెలిగితే అంతమేర పని జరిగినట్టు నిర్థారణకు వస్తామన్నారు. డిసెంబర్ 1 ప్రారంభించి 15దాకా రోజుకు వెయ్యి ఎల్‌ఈడీ బల్బులు అమర్చటాన్ని ఈఈసీఎల్ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ తరువాత రోజుకు 6వేల లైట్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఎల్‌ఈడీ వీధిదీపాల సరఫరాకు ఈఈఎస్‌ఎల్ ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. వాస్తవంగా విక్రేతలు ఎన్ని దీపాలు సరఫరా చేయగలుగుతున్నారనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మండల స్థాయిలో విద్యుత్ సమస్యలు తలెత్తి ఎల్‌ఈడీ లైట్లు సరిగ్గా పనిచేయని పక్షంలో ఆటోమేటిగ్గా సరిచేసే విధానం ఉండాలన్నారు. ఈ విద్యుత్ దీపాలు నిర్దేశిత సమయాల్లో వాటంతటవే వెలిగి, అవే ఆగిపోయేలా ఉండేందుకు పరిశీలించాలని, సీసీఎంఎస్ బాక్సులతో విద్యుత్తు ఆదా ఎలా చేస్తున్నారో, అలాగే ఆటోమేటిగ్గా వీధిదీపాలు ఆన్, ఆఫ్ అయ్యేలా చూడాలని సూచించారు. మూడో వైరు లేని ప్రాంతంలో బిగించే పనులను త్వరితగతిన చేపట్టాలన్న మంత్రి లోకేష్ ఆదేశాలపై అజయ్ జైన్, విజయానంద్ స్పందిస్తూ ఇప్పటికే ఇంధన మంత్రి ఇందుకు సంబంధించి డిస్కంలను ఆదేశించారని తెలిపారు. జవహర్ రెడ్డి మాట్లాడుతూ మూడో వైరు ఏర్పాటుకు ఏఏ ప్రాంతంలో ఎంత అవసరమో మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, తద్వారా యుద్ధప్రాతిపదికన మూడో వైరు ఏర్పాటులో డిస్కంలకు సహకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శులను ఆదేశించినట్టు వివరించారు.