ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌బీఎస్‌కు ఆనంద సూర్య రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్‌బీఎస్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిన వేమూరి ఆనంద సూర్య తెలిపారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు ఆర్‌బీఎస్ ఏర్పాటైందని తెలిపారు. ఇప్పటికే 13 జిల్లాల్లో ఆర్‌బీఎస్‌ను బలోపేతం చేశామని, అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆ సామాజిక వర్గానికి మరింత సేవగా చేసేందుకు వీలుగా ఆర్‌బీఎస్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇకపై పూర్తి స్థాయిలో కార్పొరేషన్ కార్యకలాపాల్లో పాల్గొంటానని, ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.