ఆంధ్రప్రదేశ్‌

కొనుగోళ్లలోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: వివిధ పథకాలకు సంబంధించి కొనుగోళ్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాఙనం ఉపయోగించుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ రామాజంనేయులు తెలిపారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సిస్టమేటిక్ ట్రాకింగ్ ఆఫ్ ఎక్సేంజెస్ ఇన్ ప్రొక్యూర్‌మెంట్ (స్టెప్) శిక్షణా కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానం అమలు వల్ల నీరాంచల్ వంటి కార్యక్రమాలు మరింత పారదర్శకంగా అమలు చేయవచ్చన్నారు. కరవు నివారణకు వాటర్‌షెడ్, నీరాంచల్ వంటి కార్యక్రమాలతో నీటి కొరతను అధిగమించవచ్చన్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్ రాధా నారాయణ మాట్లాడుతూ స్టెప్ విధానంలోనే కొనుగోళ్లు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్‌షెడ్ జాయింట్ కమిషనర్ ఎం.శివప్రసాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, రాజాస్థాన్, గుజరాత్, ఒడిశా, న్యూఢిల్లీ, రాష్ట్రాల నుంచి అధికారులు పాల్గొన్నారు.