ఆంధ్రప్రదేశ్‌

నష్టాల్లోనే ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: దశాబ్దాలుగా నష్టాల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న ఎపీఆర్ ఆర్టీసీని లాభాలు కాకపోయినా కనీసం నష్టాలను తగ్గించేందుకై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం మాలకొండయ్యలు చేపట్టిన సంస్కరణలు కొంతమేర ఫలితాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ నష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఏడు మాసాల్లో రాష్ట్రంలోని మొత్తం 128 డిపోల్లో కేవలం 17 డిపోలు మినహా మిగిలిన 111 డిపోలు భారీ నష్టాలతోనే కొనసాగుతున్నాయి.
అయితే విజయవాడ, విశాఖ పట్టణం బస్‌స్టేషన్‌లు రెండు లాభాల బాటలో పయనిస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ. 500 కోట్లు నష్టాలు రాగా ప్రస్తుతం రూ. 218 కోట్లు మాత్రమే నష్టాలు వచ్చాయి. అనాదిగా వస్తున్న నష్టాలు నాలుగు వేల కోట్లు ఉంటే అదనంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 800 కోట్లు నష్టాలు వచ్చాయి. ప్రస్తుత ఏడు మాసాల్లో అత్యధికంగా లాభాల్లో విజయవాడ డిపో రూ. 11 కోట్ల, 76 లక్షలతో, తూ.గో జిల్లాలో అమలాపురం రూ. 5 కోట్ల, 28 లక్షల, 14వేలు, కాకినాడ డిపో రూ. 5 కోట్ల, 13 లక్షల, 83 వేలుతో ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత ఆటోనగర్ రూ. 5 కోట్ల, 13 లక్షల, 83వేలు, రాజమండ్రి రూ. 3 కోట్ల, 14 లక్షల, 17వేలు, కనిగిరి రూ. 3 కోట్ల, 7 లక్షలు, కడప రూ. 2 కోట్ల, 56 లక్షల, 73 వేలు, తిరుమల రూ. 2 కోట్ల, 21 లక్షలు, కర్నూలు రూ. 2 కోట్ల, 17 లక్షల, 74వేలు, మచిలీపట్నం కోటి, 42 లక్షలు, విశాఖ కోటి, 33 లక్షల, 56 వేలు, రాజోలు రూ. 77 లక్షల, 36వేలు, మధురవాడ రూ. 61 లక్షల, 23వేలు, గుంటూరు-2 32లక్షల, 62వేలు, తుని రూ. 31 లక్షల, 10వేలు లాభాలతో నడుస్తున్నాయి. ఇక నష్టాల్లో రూ. 4 కోట్ల, 84 లక్షలతో ఎమ్మెగనూర్ డిపో ప్రథమ స్థానంలోను, రావులపాలెం డిపో రూ. 8 లక్షల, 37వేలతో చివరి స్థానంలో నిలిచింది.