ఆంధ్రప్రదేశ్‌

టీచర్లను తక్షణం రిలీవ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: ఈ ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌లో బదిలీ కోరుకుని, రిలీవర్ లేని కారణంగా బదిలీకి నోచుకోని ఉపాధ్యాయులను ఈ నెల 12లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ కమిషనర్ కే సంధ్యారాణి ఆర్‌సీ నెం 1882 ఉత్తర్వులను సోమవారం జారీ చేసారు. బదిలీ అయిన ఉపాధ్యాయునికి బదులుగా మరో ఉపాధ్యాయుడు ఆ పాఠశాలకు వస్తేనే రిలీవ్ చేయాలనే నిబంధన వలన రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ వారు కోరుకున్న పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ సమస్యపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదు చేయగా కమిషనర్ అక్టోబర్ 17న, తిరిగి నవంబర్ 17న రెండుసార్లు ఆదేశాలిచ్చినప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారులు ఏవో కారణాలతో అమలు చేయలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.