ఆంధ్రప్రదేశ్‌

కాటేసిన కనుపాప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, డిసెంబర్ 4: ముక్కుపచ్చలారని గిరిజన అనాధ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఫాస్టర్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్న వైట్ హౌస్ చిల్డ్రన్ హోం నిర్వాహకుడి రాసలీలలను అక్కడ ఉన్న బాలికలే బయటపెట్టారు. గత కొన్నాళ్లుగా తమను హోం నిర్వాహకుడు ప్రసాదకుమార్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపారు. అతనితోపాటు ఆతని కుమారుడు షారున్ కూడా లైంగికదాడులకు పాల్పడుతున్నాడని బాలికలు సోమవారం విలేఖరులకు తెలిపారు. ప్రసాదకుమార్ అనేక సంవత్సరాలుగా గ్రామంలో అనాధ పిల్లల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడని, 19మంది గిరిజన బాలికలు ఇక్కడ ఉంటూ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. లైంగికదాడి విషయం బయటపడటంతో ప్రసాదకుమార్ అక్కడ నుంచి పరారయ్యాడు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వైట్ హౌస్ అనాధ పిల్లల ఆశ్రమాన్ని ఆయన నడుతున్నట్లు సీఐ సంజీవిరావు, ఎస్‌ఐ సన్యాసినాయుడు జరిపిన ప్రాథమిక విచారణ వివరాలు విలేఖరులకు తెలియజేశారు.