ఆంధ్రప్రదేశ్‌

కమలనాథులకు ‘రథాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: మరో ఏడాది కాలంలో సాధారణ ఎన్నికలు జరుగబోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీతో తరిగి పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నది పోలవరం ప్రాజెక్టు..కాపు రిజర్వేషన్‌లపై ఆధారపడి ఉంది.
ఇక తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో తెలియని స్థితి. ఈ నేపథ్యంలో ఒంటరిగానైనా పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోటానికి బీజేపీ వ్యూహరచన చేస్తున్నది. ఇందులో భాగంగా తొలుత కార్యకర్తలను సైతం సన్నద్ధం చేస్తున్నదా అన్నట్లు ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో వినియోగించిన మోటార్ బైక్‌లు దశల వారీగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు తరలిరావడం ప్రారంభమైంది.
తొలి దశగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొటి చొప్పున పంపిణీ చేసేందుకై మొత్తం తెలుపురంగుతో కూడిన 175 టీవీఎస్ బైక్‌లు ఇటీవల విజయవాడ నగరానికి చేరాయి. యుపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వీటన్నింటికి విజయవాడలోని ఏపీ రిజిస్ట్రేషన్ కింద మార్పిడి చేసేందుకై అతి పెద్ద గోదాములలో భద్రపరిచడానికి అద్దెలు భరించాల్సి వస్తుందన్న కారణంతో విశ్వహిందూ పరిషత్ కార్యాలయం, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం, బీజేపీ నేతల నివాస ప్రాంగణాల్లోనూ ప్రస్తుతం భద్రపరిచారు. తెలంగాణాకు కూడా దాదాపు వందకుపైగా బైక్‌లు వెళ్లినట్లు సమాచారం. వీటిని ఆయా నియోజకవర్గాల్లో అదీ ఎలాంటి పారితోషికాన్ని ఆశించకుండా ఎన్నికల వరకు పూర్తి సమయాన్ని కేటాయించే కార్యకర్తలకు అప్పగించబోతున్నారు.