ఆంధ్రప్రదేశ్‌

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ప్రైవేటీకరణపై మనస్తాపానికి గురై, అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల రైల్వే స్టేషన్‌వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. డీసీఐలో 2012లో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వెంకటేష్ విధుల్లో చేరాడు. డీసీఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ సంస్థ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో నవంబర్ 30వ తేదీన వెంకటేష్ పాల్గొన్నాడు. డీసీఐ మూసేస్తే తన భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. డీసీఐ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఎంపీ హరిబాబును కలిసినప్పుడు ఆయన ప్రైవేటీకరణను ఆపలేమని చెప్పడంతో వెంకటేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తను అప్పుల్లో ఉన్నానని, డీసీఐ ప్రైవేటీకరిస్తే, తన కుటుంబం రోడ్డున పడుతుందని వెంకటేష్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, కంపెనీని ప్రైవేటుపరం చేయవద్దని వెంకటేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా, డీసీఐని నూరు శాతం ప్రైవేటీకరించాలని ఇటీవలే ఇంటర్ ఇన్ట్యూటియల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. త్వరలోనే డీసీఐని ప్రైవేటీకరించనుంది.

వెంకటేష్ ఫైల్‌పొటో