ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషా పండుగకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) డిసెంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు భాషా ప్రేమికులందరూ పాలుపంచుకోవాలని తెలంగాణ గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్ పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచే వచ్చే వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాస, భోజన, రవాణా సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాటానికి చర్యలు తీసుకుంటుందన్నారు. సభలలో ప్రతినిధులుగా పాల్గొనాలనుకునేవారు ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవేశ రసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక్షంగా సంప్రదించాలనుకునేవారు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు ప్రత్యేక కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం చేయటానికి 50 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. తెలుగు ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాల పండుగులను రాష్ట్ర పండుగలుగా ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిసీ కమిటీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను మన తెలుగువాడైన ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు లాఛనంగా ప్రారంభిస్తారని, ముగింపు మహాసభలకు రాష్టప్రతి రామనాథ్ కోవింద్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్, సామల రమేష్ బాబు, రచయితలు, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.