ఆంధ్రప్రదేశ్‌

కియా స్ఫూర్తితో మరిన్ని పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: దక్షిణకొరియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం పర్యటన ఆరంభమైంది. తొలిరోజు సోమవారం ముఖ్యమంత్రి ముందుగా కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ సంస్థకు కేటాయించిన ప్రాంతంలో వౌలిక సదుపాయాల అభివృద్ధి దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ బృందం ప్రదర్శించింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం కొరియాకు పూర్తి సానుకూల పరిస్థతిని కల్పించేలా సకల వౌలిక సదుపాయాలతో కొరియన్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కియా మోటార్స్ సంస్థ స్ఫూర్తితో కొరియా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, అందుకు కియా సంస్థ చొరవ తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్న కియా మోటారు కార్ల పరిశ్రమను అభినందించారు. కొరియా అభివృద్ధి తననెంతో ముగ్ధుణ్ణి చేసిందని ప్రశంసించారు. దక్షిణకొరియాలో కియా అనుబంధ సంస్థల ప్రతినిధులను ఒకేసారి కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఏపీ సీఎం ప్రశంసించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలాంశాలపై కొందరు ప్రతినిధుల సందేహాలను ముఖ్యమంత్రి నివృతి చేశారు. ‘ఏపీలో మీకు ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తవని నేను మాటిస్తున్నాను. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని మరోమారు స్పష్టం చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘పెట్టుబడులకు మీరు ఎంచుకున్న అనంతపురం జిల్లా అటు బెంగళూరు విమానాశ్రయానికి, ఇటు కష్ణపట్నం నౌకాశ్రయానికి అనుసంధానంగా ఉంది. వౌలిక వసతులు, శాంతిభద్రతలు సవ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి కార్మిక అశాంతి లేని వాతావరణం మా రాష్ట్రంలో ఉంది. మా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని మీలో ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా కోరుతున్నా’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. భౌగోళికంగా, జనాభా సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు, దక్షిణకొరియాకు సారూప్యతలు ఉన్నాయన్నారు. తయారీ, సాంకేతిక రంగంలో దక్షిణకొరియా చాలా ముందంజలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత్ ఇప్పుడు తయారీరంగంలో మెరుపువేగంతో దూసుకువెళ్తోందని, గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు భారతీయులేనని అన్నారు. ‘మీకు మా రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలని ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో భారత్ ఒక్కదానికే రెండంకెల వృద్ధి రేటును సాధించగల సామర్థ్యం ఉంది. గడచిన మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోంది. వచ్చే 15 ఏళ్లపాటు 15 శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే మా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు. భారత ‘లుక్ ఈస్ట్’ పాలసీని ఏపీ సాకారం చేస్తుందన్నారు. దక్షిణకొరియా, ఇక్కడి పరిశ్రమలతో బలమైన సంబంధాలను తాము కోరుకుంటున్నామని చెప్పారు.