ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో దొంగల రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 4: రిజర్వేషన్ల పేర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల రాజీకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఏ ఒక్క కులాన్నీ వదిలిపెట్టలేదన్నారు. ప్రజా సంకల్పయాత్ర 26వ రోజు సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గుత్తిలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ‘నిన్నటికి నిన్న అసెంబ్లీలో చూశాం. వాల్మీకులు, బోయల్ని ఎస్టీల్లో చేర్చి, కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఎస్టీల్లో చేర్చేందుకు ఇలా ఎన్నిసార్లు తీర్మానం చేస్తావు బాబూ..’ అంటూ ప్రశ్నించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో బోయల్ని, వాల్మీకుల్ని ఎస్టీలుగా చేరుస్తానన్నావు.. ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది ప్రయత్నిస్తానని అంటున్నావు. కాపుల్ని కూడా బీసీలు చేస్తానన్నావు.. ఇప్పుడేమో బీసీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తానంటున్నావు. ఇలా మాటిమాటికి మాటమార్చే నీలాంటి దిక్కుమాలిన సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు అని ఘాటుగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ కిలో బంగారం ఇస్తానంటాడు. అలాగే ప్రతి ఇంటికీ మారుతీ కారు ఇస్తానంటాడు. వాటితో లాభం లేదనుకుంటే ఇంకేమైనా హామీలిస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, నాలుగేళ్ల పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలొస్తాయని స్వయంగా సీఎం కార్యకర్తలకు చెబుతున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నపుడు మనకు ఎలాంటి నాయకుడు కావాలి, మోసం చేసే నాయకుడు కావాలా, నమ్మించి దగా చేసే నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు. పెన్షన్ నుంచి బియ్యం దాకా, మట్టి నుంచి ఇసుక దాకా, మద్యం నుంచి రాజధాని భూముల దాకా దొంగల రాజ్యం సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీదారుల్ని తయారు చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ఇంటికో ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అయితే చంద్రబాబు ప్రత్యేక హోదాను అటకెక్కించారని ధ్వజమెత్తారు. తనపై ఉన్న కేసులు దర్యాప్తు చేయకుండా ఉండేందుకే హోదాను కేంద్రానికి అమ్మేశారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాయన్నారు. ఆయన ఒకడుగు ముందుకు వేస్తే, తాను రెండుగులు ముందుకు వేసి ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా నవరత్నాలు ప్రకటించానని, చెప్పినవి, చెప్పనవి అన్ని హామీలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అదే గ్రామంలోని 10 మంది సభ్యులతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తానని అన్నారు. సంక్షేమ పథకాల కోసం జన్మభూమి కమిటీల వద్దకో, ఎంపీ, ఎమ్మెల్యేల వద్దకో వెళ్లాల్సిన పనిలేదని, దరఖాస్తు చేసుకున్న 70 గంటల్లో గ్రామ సచివాలయం నుంచి మంజూరు చేయిస్తానని భరోసా అన్నారు.
ప్రజా సంకల్పయాత్ర 26వ రోజు సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లాలో ఆదివారం పాదయాత్ర ముగించిన జగన్ సోమవారం ఉదయం 8.30 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తొలుత బసినేపల్లిలో వైకాపా జెండాను ఆవిష్కరించారు. బసినేపల్లి నుంచి గుత్తి వరకు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలో మహిళలతో జగన్ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సంకల్పయాత్ర కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లికి చేరుకోగానే గ్రామ మహిళలు పెద్దసంఖ్యలో ఖాళీ బిందెలతో జగన్‌కు స్వాగతం పలికారు. గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, తాగునీటి కోసం అల్లాడిపోతున్నామని జగన్‌తో మహిళలు మొరపెట్టుకున్నారు. వారి సమస్యను సాంతంగా విన్న జగన్ ప్రభుత్వాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని అన్నారు.