ఆంధ్రప్రదేశ్‌

నకిలీ మందుల కేసును ఛేదించిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 4: నకిలీ మందులతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల మూలాలను ఛేదించడంలో విజయవాడ నగర పోలీసులు, డ్రగ్ కంట్రోల్ శాఖాధికారులు సఫలీకృతులైనారు. ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురితోపాటు రాష్ట్రంలోని వివిధ మందుల దుకాణదారులను అదుపులోకి తీసుకుని, మందుల తయారీకి చెందిన వివిధ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న అతి స్వల్ప వ్యవధిలోనే కేసు మూలాలను కనుగొని ఛేదించిన వైనంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు అధికారులను అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారు గత అక్టోబర్ 31న ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నగర పోలీస్ కమిషనర్ డి గౌతం సవాంగ్ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ డి కాశీ విశ్వనాథ్, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశోధించి దర్యాప్తు చేపట్టగా నకిలీ మందులకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మల్టీనేషన్ మందుల కంపెనీ అల్ట్రాసెట్ బ్రాండ్ మందులను పోలీన నకిలీ మందులు దేశంలో అనేక ప్రాంతాల్లో చలామణిలో ఉన్నాయి. విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు పరిధిలో గల వివిధ మెడికల్ షాపులలో సోదాలు చేయగా సాయి మెడికల్స్ అనే షాపులో అల్ట్రాసెట్ నకిలీ మందులు గుర్తించారు. వాటిపై ఉన్న బ్యాచ్ నెంబర్ ఎన్ 548 ద్వారా వాటిని నకిలీ మందులుగా నిర్ధారించారు. తొలుత కేసులో ఐదుగురు నిందుతులైన విజయవాడకు చెందిన సాయి మెడికల్‌కు చెందిన పేర్ల రవికుమార్, నరసరావుపేట హరికృష్ణ మెడికల్స్ చెందిన ఫణికుమార్, గుంటూరు దుర్గా మెడికల్స్ నిర్వాహుకులు చైతన్య, రామకృష్ణ, నంద్యాల మహేశ్వరీ మెడికల్స్ నిర్వాహుకుడు ఫృధ్వీతేజ లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈకేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌కు చెందిన మరో ముగ్గురు నిందితులు రూరుకీకి చెందిన ఇన్నోవా డ్రగ్స్ నిర్వాహుకుడు విశాల్ అన్‌సానే, మొహమ్మద్ నసీమ్, ఆళ్లగడ్డకు చెందిన శ్రీ లలితశ్రీ మెడికల్స్ నిర్వాహకుడు మునిశేఖర్ లను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రజారోగ్యానికి హాని కలిగించి ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ మందుల తయారీ, పంపిణీ చట్టరీత్యా నేరం కాబట్టి ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరించారు. నగర కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నకిలీ, కల్తీలు తయారు చేసే కేంద్రాలపై మెరుపుదాడులు నిర్వహించి దేశంలోనే మొదటి సారిగా ఈ కేంద్రాల మూలాలను కనిపెట్టి అతి తక్కువ కాలంలోనే కేసును ఛేదించామన్నారు.